Stock Market: 60000+ సూపర్ లాభాల్లో ముగిసిన సూచీలు.. ఇరగదీసిన ఆ రంగాలు..
Stock Market: ఈ రోజు ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు చివరికి పాజిటివ్ మోడ్ లో క్లోజ్ అయ్యాయి. ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు మార్కెట్లకు దన్నుగా నిలిచాయి. ప్రధానంగా ఆటో, మెటల్, బ్యాంకింగ్ రంగాల షేర్లు మంచి వృద్ధిని సాధించాయి.
3.30కి మార్కెట్లు ముగిసే సమయానికి బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 311 పాయింట్ల లాభంలో క్లోజ్ అయింది. ఇదే క్రమంలో నిఫ్టీ సూచీ 98 పాయింట్లు, నిఫ్టీ బ్యాంక్ సూచీ 532 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 153 పాయింట్ల మేర లాభాలను నమోదు చేశాయి. ఈ క్రమంలో ఆయిల్ అండ్ గ్యాస్, పవర్ రంగాల సూచీలు 1 శాతం మేర లాభపడ్డాయి. అయితే ఐటీ సూచీ మాత్రం నష్టాల్లో ట్రేడింగ్ ముగించింది.

వడ్డీ రేట్ల పెంపుదల చక్రాన్ని సెంట్రల్ బ్యాంకులు నిలిపివేస్తాయన్న ఆశతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌లు ఊపందుకున్నాయి. దీంతో ఆసియా మార్కెట్లు పుంజుకున్నాయి. జపాన్ నిక్కీ 225 ఇండెక్స్ 1 శాతం పెరిగింది. హాంకాంగ్ హాంగ్ సెంగ్ కూడా పెరిగింది. యూరోపియన్ మార్కెట్‌లోనూ బుల్లిష్ వాతావరణం నెలకొంది.
మార్కెట్లు ముగిసే నాటికి NSE సూచీలో కోటక్ బ్యాంక్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఐషర్ మోటార్స్, బజాజ్ ఆటో, టాటా స్టీల్, ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, హిందాల్కొ, బజాజ్ ఫిన్ సర్వ్, మారుతీ, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎస్బీఐ, ఓఎన్జీసీ, పవర్ గ్రిడ్, నెస్లే, బీపీసీఎల్, ఎస్బీఐ లైఫ్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, దివీస్ ల్యాబ్స్ కంపెనీల షేర్లు లాభాల్లో టాప్ గెయినర్స్‌గా నిలిచాయి.

ఇదే క్రమంలో ఈ వారం ఐటీ కంపెనీలు తమ 4వ త్రైమాసిక ఫలితాలను విడుదల చేయనున్న తరుణంలో అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. మార్కెట్ క్లోజింగ్ నాటికి టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్, విప్రో, టెక్ మహీంద్రా, ఏషియన్ పెయింట్స్, టాటా మోటార్స్, టాటా కన్జూమర్, ఎల్ టి, టైటాన్, హెచ్డీఎఫ్సీ లైఫ్, బ్రిటానియా కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్స్‌గా నిలిచాయి.


Click it and Unblock the Notifications