Market Closing: ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు తర్వాత పుంజుకుని సాయంత్రానికి మంచి లాభాల్లో ట్రేడింగ్ ముగించాయి. ఈ క్రమంలో ఐటీ రంగం షేర్లు మార్కెట్లను లాభాల్లో నడిపించాయి.
మార్కెట్లు ముగిసే సమయానికి బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 307 పాయింట్ల లాభపడగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 90 పాయింట్ల లాభంతో ట్రేడింగ్ ముగించింది. అయితే బ్యాంక్ నిఫ్టీ సూచీ మాత్రం 40 పాయింట్లు నష్టపోయింది. ఇదే సమయంలో నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 322 పాయింట్లు గెయిన్ అయ్యింది. ఈ క్రమంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇండెక్స్ దాదాపు 3 శాతం లాభపడగా.. రియల్టీ, ఆయిల్ & గ్యాస్, ఆటో రంగాలు 1 శాతం చొప్పున పెరిగాయి.

ఎన్ఎస్ఈలో హీరో మోటార్స్, టెక్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్, టీసీఎస్, ఇన్ఫోసిస్, బజాజ్ ఫిన్ సర్వ్, ఎల్ టిఐఎమ్, డాక్టర్ రెడ్డీస్, అపోలో హాస్పిటల్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, బీపీసీఎల్, విప్రో, టాటా మోటార్స్, టైటాన్, ఓఎన్జీసీ, సన్ ఫార్మా, అదానీ పోర్ట్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, దివీస్ ల్యాబ్స్, మారుతీ, హిందుస్థాన్ యూనీలివర్, ఎస్బీఐ లైఫ్, అల్ట్రాటెక్ సిమెంట్స్, బజాజ్ ఆటో, కోటక్ బ్యాంక్, రిలయన్స్, పవర్ గ్రిడ్ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో యాక్సిస్ బ్యాంక్, కోల్ ఇండియా, అదానీ ఎంటర్ ప్రైజెస్, టాటా కన్జూమర్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐటీసీ, ఎల్ టి, జేఎస్డబ్ల్యూ స్టీల్, సిప్లా, నెస్లే, ఐషర్ మోటార్స్, యూపీఎల్, హిందాల్కొ, హెచ్డీఎఫ్సీ లైఫ్, బ్రిటానియా, ఎస్బీఐ, ఎయిర్ టెల్, గ్రాసిమ్ కంపెనీల షేర్లు నష్టాలతో తమ ప్రయాణాన్ని ముగించాయి.


Click it and Unblock the Notifications