Closing Bell: ఉదయం ఒడిదొడుకుల్లో మెుదలైన దేశీయ స్టాక్ మార్కెట్లు ఇంట్రాడేలో నష్టాల నుంచి లాభాల్లోకి తిరిగి వచ్చాయి. ఈ క్రమంలోనే సాయంత్రం ముగింపు సమయానికి బెంచ్ మార్క్ సూచీలు భారీ లాభంతో తమ ట్రేడింగ్ క్లోజ్ చేశాయి.
మార్కెట్లు ముగింపు సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 677 పాయింట్లు లాభపడగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 194 పాయింట్ల మేర నష్టాన్ని నమోదు చేసింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 287 పాయింట్లు గెయిన్ అవగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 466 పాయింట్లు గెయిన్ అయ్యింది. ఈ సమయంలో బీఎస్ఈ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ షేర్లు 1% మేర లాభపడ్డాయి. నేడు క్యూ4 ఫలితాలను ప్రకటించిన మహీంద్రా అండ్ మహీంద్రా ఈవీల అభివృద్ధికి రూ.12,000 కోట్లు వెచ్చించాలని నిర్ణయించినట్లు ప్రకటించింది.

ఎన్ఎస్ఈలో మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా కన్జూమర్, ఎయిర్ టెల్, ఎల్ టిఐఎమ్, ఇన్ఫోసిస్, టైటాన్, హెచ్డీఎఫ్సీ లైఫ్, హీరో మోటార్స్, బజాజ్ ఫిన్ సర్వ్, బ్రిటానియా, జేఎస్డబ్ల్యూ స్టీల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎల్ టి, ఎస్బీఐ లైఫ్, విప్రో, యాక్సిస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, అపోలో హాస్పిటల్స్, ఓఎన్జీసీ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా నేడు తమ ప్రయాణాన్ని ముగించాయి.
ఇదే క్రమంలో మారుతీ, ఎస్బీఐ, టాటా మోటార్స్, బీపీసీఎల్, పవర్ గ్రిడ్, డాక్టర్ రెడ్డీస్, అదానీ ఎంటర్ ప్రైజెస్, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఆటో, హిందాల్కొ, కోల్ ఇండియా, ఎన్టీపీసీ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా నేడు తమ ప్రయాణాన్ని ముగించాయి. ప్రధానంగా ఎన్నికలు కావటంతో ఊహాగానాల మధ్య ట్రేడర్ల బెట్టింగులతో స్టాక్ మార్కెట్లు భారీగా ఒడుదొడుకులను చూస్తున్నాయి.


Click it and Unblock the Notifications