Stock Market: రోజంతా ఊగిసలాటల్లో సూచీలు.. చివరికి స్వల్ప లాభాలతో..
Market Closing: ఈరోజు ఉదయం దేశీయ స్టాక్ మార్కెట్లు ఒడిదొడుకులతో ఫ్లాట్ ప్రారంభాన్ని చేశాయి. అయితే ఆ తర్వాత నష్టాల్లోకి జారుకున్నప్పటికీ ఇంట్రాడే ట్రేడింగ్ సమయంలో కోలుకుని చివరికి లాభాల్లో ప్రయాణాన్ని ముగించాయి.
మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 85 పాయింట్ల లాభంలో ఉండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 40 పాయింట్ల లాభంలో ముగిసింది. ఇదే క్రమంలో బ్యాంక్ నిఫ్టీ సూచీ మాత్రం 92 పాయింట్ల మేర నష్టపోగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం 72 పాయింట్ల లాభాలతో ట్రేడింగ్ ముగించింది.

ప్రధానంగా ఈవారం జరగనున్న ఫెడ్ సమావేశం మార్కెట్లకు చాలా కీలకం కానుంది. మార్కెట్ వర్గాలు, నిపుణుల అంచనా ప్రకారం ఈ సారి పావెల్ వడ్డీ రేట్ల పెంపుకు బ్రేక్ వేయెుచ్చని తెలుస్తోంది. నేడు ఇండియాలో విడుదలైన WPI ద్రవ్యోల్బణం సైతం భారీగా తగ్గటం ఊరటను అందిస్తోంది. అయితే ఇప్పుడు అందరి చూపులు మాత్రం రుతుపవనాలపైనే ఉంది.
ఎన్ఎస్ఈలో టాటా కన్జూమర్, గ్రాసిమ్, జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, పవర్ గ్రిడ్, టాటా మోటార్స్, ఓఎన్జీసీ, అపోలో హాస్పిటల్స్, నెస్లే, అల్ట్రాటెక్ సిమెంట్స్, రిలయన్స్, ఎన్టీపీసీ, హిందుస్థాన్ యూనీలివర్, హిందాల్కొ, విప్రో, మహీంద్రా అండ్ మహీంద్రా, కోటక్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, అదానీ పోర్ట్స్, మారుతీ కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతూ టాప్ గెయినర్లుగా ముగిశాయి.
ఇదే క్రమంలో ఇండస్ ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్ టెల్, యాక్సిస్ బ్యాంక్, హీరో మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఆటో, బజాజ్ ఫిన్ సర్వ్, ఐషర్ మోటార్స్, ఎస్బీఐ లైఫ్, సిప్లా, అదానీ ఎంటర్ ప్రైజెస్, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ లైఫ్, టైటాన్, టెక్ మహీంద్రా, ఐటీసీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బీపీసీఎల్, బ్రిటానియా కంపెనీల షేర్లు నష్టాలతో ప్రయాణాన్ని ముగించి టాప్ లూజర్లుగా నిలిచాయి.


Click it and Unblock the Notifications