Stock Market: లాభాల్లో ముగిసిన Sensex, Nifty.. కాపాడిన మూడు రంగాలు..
Market Closing: ఉదయం ఉత్సాహంగా ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు చివరికి లాభాలతో తమ ప్రయాణాన్ని ముగించాయి. ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్ల సానుకూలతలు దీనికి కారణంగా నిలిచాయి.
మార్కెట్లు ముగిసే సమయానికి బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 276 పాయింట్ల లాభపడగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 89 కోట్ల మేర లాభపడింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 104 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 27 పాయింట్ల లాభంతో నేడు ప్రయాణాన్ని ముగించాయి. దీనికి తోడు ఫార్మా, రియల్టీ, మెటల్ రంగాలు ర్యాలీ కలిసొచ్చాయని చెప్పుకోవాలి.

NSEలో ఎస్బీఐ లైఫ్, హెచ్డీఎఫ్సీ లైఫ్, అదానీ ఎంటర్ ప్రైజెస్, హిందాల్కొ, జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, దివీస్ ల్యాబ్, సన్ ఫార్మా, టైటాన్, రిలయన్స్, యూపీఎల్, టాటా మోటార్స్, ఎయిర్ టెల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బజాజ్ ఫిన్ సర్వ్, డాక్టర్ రెడ్డీస్, హీరో మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, సిప్లా, బజాజ్ ఆటో, అల్ట్రాటెక్ సిమెంట్స్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, గ్రాసిమ్, నెస్లే, విప్రో, హెచ్సీఎల్ టెక్, కోల్ ఇండియా కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా తమ ప్రయాణాన్ని ముగించాయి.
ఇదే క్రమంలో బీపీసీఎల్, టెక్ మహీంద్రా, ఎల్ టిఐఎమ్, ఎన్టీపీసీ, ఎల్ టి, ఎస్బీఐ, ఓఎన్జీసీ, బ్రిటానియా, అదానీ పోర్ట్స్, ఐషర్ మోటార్స్, అపోలో హాస్పిటల్స్, మారుతీ, టాటా కన్జూమర్, టీసీఎస్, పవర్ గ్రిడ్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, కోటక్ బ్యాంక్, ఐటీసీ, హిందుస్థాన్ యూనీలివర్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా తమ ప్రయాణాన్ని ముగించాయి.


Click it and Unblock the Notifications