Stock Market: ఉదయం దేశీయ స్టాక్ మార్కెట్లు అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా ప్రారంభమయ్యాయి. ఆరంభంలో ఫ్లాట్ గా ఉన్న సూచీలు చివరికి లాభాల్లోనే ముగిశాయి. నిన్న అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగియటం దీనివెనుక ఉన్నట్లు తెలుస్తోంది.

మార్కెట్ సూచీలు..
సాయంత్రం మార్కెట్లు ముగిసే సమయానికి బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 274 పాయింట్ల లాభంతో ముగియగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 84 పాయింట్ల లాభంలో ముగిసింది. ఇదే క్రమంలో బ్యాంక్ నిఫ్టీ సూచీ 110 పాయింట్ల లాభంలో, నిఫ్టీ మిడ్ క్యాప్ 168 పాయింట్ల లాభంలో ముగిసింది.

పేటీఎం షేర్..
ఈరోజు స్టాక్ మార్కెట్లో పేటీఎం షేర్ భారీగా పతనమైంది. దాదాపు 12 శాతం వరకు నష్టపోయింది. ప్రస్తుతం షేర్ విలువ మార్కెట్ క్లోజింగ్ నాటికి రూ.475.55 వద్ద ఉంది. ఇది షేర్ భారీ పతనాల్లో ఒకటని చెప్పుకోవాలి. రిలయన్స్ ఫిన్ టెక్ తన ఎన్బీఎఫ్సీ వ్యాపారాన్ని విస్తరించే ప్రణాళికలు పేటీఎంను భారీగా దెబ్బతీయవచ్చని తెలుస్తోంది. జియో ఫైనాన్స్ దేశంలో 5వ అతి పెద్ద సంస్థగా ఎదుగుతుందని ఫారిన్ బ్రోకరేజ్ మాక్విన్ వెల్లడించటంతో పేటీఎం షేర్లు ప్రభావితం అయ్యాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

టాప్ గెయినర్స్ అండ్ లూజర్స్..
ఎన్ఎస్ఈ సూచీలో ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎన్టీపీసీ, జేఎస్డబ్యూ స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్, అపోలో హాస్పిటల్, టైటాన్, మహీంద్రా అండ్ మహీంద్రా, దివీస్ ల్యాబ్స్, యూపీఎల్, ఇన్ఫోసిస్ కంపెనీల షేర్లు లాభాల్లో ముగియగా.. ఇదే క్రమంలో బీపీసీఎల్, నెస్లే, భారతీ ఎయిర్ టెల్, పవర్ గ్రిడ్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఓన్జీసీ, కోల్ ఇండియా, సిప్లా, యాక్సిస్ బ్యాంక్ తో పాటు మరిన్ని కంపెనీల షేర్లు నష్టాల్లో ముగిశాయి.
More From GoodReturns

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

Stock market: స్టాక్ మార్కెట్ ఊపు! ఒక్కరోజే 2000 పాయింట్లు జంప్..ఈ 5 కారణాలే కీలకం!

స్టాక్ మార్కెట్లో అల్లకల్లోలం.. రూ. 1.2 లక్షల కోట్లను వెనక్కి తీసుకున్న విదేశీ ఇన్వెస్టర్లు..కారణం ఏంటంటే..

Stock market Holidays: ఏప్రిల్‌లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

Gold: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్! భారీ పతనం తర్వాత కోలుకుంటున్న పసిడి.. నిపుణుల అంచనా ఇదే.!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!



Click it and Unblock the Notifications