Stock Market: సూపర్ లాభాల్లో ముగిసిన మార్కెట్లు.. నిరాశపరిచిన బ్యాంకింగ్ రంగం..
Closing Bell: ఉదయం ఆందోళనల మధ్య ఫ్లాట్ ట్రేడింగ్ కొనసాగించిన మార్కెట్లు చివరికి లాభాల్లో తమ ప్రయాణాన్ని ముగించాయి. నేడు బ్యాంకింగ్ రంగంలోని షేర్లు ప్రధానంగా ఒత్తిడితో కొంత చిత్తయ్యాయి.
సాయంత్రం మార్కెట్లు ముగిసే సమయానికి బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 455 పాయింట్లు లాభపడగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 158 పాయింట్లను లాభంతో ముగిసింది. నిఫ్టీ బ్యాంక్ సూచీ మాత్రం ఒత్తిడి కారణంగా 135 పాయింట్లు నష్టపోయింది. చివరిగా నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం 575 పాయింట్ల లాభంతో ముగింపు పలికింది.

NSEలో బీపీసీఎల్, హెచ్డీఎఫ్సీ లైఫ్, హెచ్సీఎల్ టెక్, టీసీఎస్, మారుతీ, ఓఎన్జీసీ, విప్రో, ఎస్బీఐ లైఫ్, ఇన్ఫోసిస్, ఎల్ టి, టాటా స్టీల్, యూపీఎల్, ఎయిర్ టెల్, ఎస్బీఐ, టెక్ మహీంద్రా, కోల్ ఇండియా, అల్ట్రాటెక్ సిమెంట్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఐషర్ మోటార్స్, టాటా మోటార్స్ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా తమ ప్రయాణాన్ని ముగించాయి.
ఇదే క్రమంలో పవర్ గ్రిడ్, బ్రిటానియా, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐటీసీ, గ్రాసిమ్, కోటక్ బ్యాంక్, బజాజ్ ఫిన్ సర్వ్, రిలయన్స్, యాక్సిస్ బ్యాంక్, సిప్లా, అపోలో హాస్పిటల్స్, నెస్లే, బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా తమ ప్రయాణాన్ని నేడు ముగించాయి.


Click it and Unblock the Notifications