Stock Market: సూపర్ లాభాలతో ముగిసిన మార్కెట్ సూచీలు.. దంచికొట్టిన ఆ 3 రంగాలు..
Market Closing: ఉదయం నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు తమ దిశను మార్చుకుని లాభాల బాట పట్టాయి. ప్రధానంగా పవర్, క్యాపిటల్ గూడ్స్, బ్యాంకింగ్ రంగాల షేర్లు మార్కెట్లను నడిపించాయి.
మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 385 పాయింట్ల లాభంలో ఉండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 116 పాయింట్ల మేర లాభాలతో ట్రేడింగ్ ముగించింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 469 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 310 పాయింట్లు లాభపడ్డాయి. ఎఫ్ఎమ్సీజీ, ఫార్మా రంగాల సూచీలు మినహా అన్ని రంగాలు లాభాల్లో కొనసాగాయి. ప్రస్తుతం చాలా మంది ఇన్వెస్టర్లు జీ20 సదస్సులో జరగనున్న డీల్స్ గురించి ఎక్కువ ఆసక్తిగా ఉన్నారు.

NSEలో కోల్ ఇండియా, ఎల్ టి, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎస్బీఐ లైఫ్, ఎస్బీఐ, టెక్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఎల్ టిఐఎమ్, యాక్సిస్ బ్యాంక్, ఎన్టీపీసీ, హెచ్డీఎఫ్సీ లైఫ్, మారుతీ, పవర్ గ్రిడ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కోటక్ బ్యాంక్, విప్రో, హీరో మోటార్స్, టీసీఎస్, బజాజ్ ఆటో, టాటా మోటార్స్ కంపెనీల షేర్లు లాభాల్లో ట్రేడింగ్ ముగించి టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో టాటా కన్జూమర్, ఓఎన్జీసీ, బ్రిటానియా, మహీంద్రా అండ్ మహీంద్రా, సన్ ఫార్మా, సిప్లా, ఇన్ఫోసిస్, హిందాల్కొ, అల్ట్రాటెక్ సిమెంట్స్, హిందుస్థాన్ యూనీలివర్, ఎయిర్ టెల్, నెస్లే, దివీస్ ల్యాబ్స్, బజాజ్ ఫైనాన్స్, ఐటీసీ, అపోలో హాస్పిటల్స్ కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ ముగింటి టాప్ లూజర్లుగా నిలిచాయి.


Click it and Unblock the Notifications