Stock Market: మెరిసిన నెన్సెక్స్, నిఫ్టీలు.. ఐటీ స్టాక్స్ పైకి.. మెటల్స్ కిందకు..
Market Closing: ఉదయం ఉల్లాసంగా ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు క్లోజింగ్ సమయానికి అస్థిరతకు గురయ్యాయి. ఇంట్రాడేలో లాభాలు ఆవిరయ్యాయి.
మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 205 పాయింట్ల లాభంలో ఉండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 38 పాయింట్ల లాభంతో ముగించింది. అయితే నిఫ్టీ బ్యాంక్ సూచీ మాత్రం 39 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ కూడా 50 పాయింట్ల నష్టంలో నేడు నెగటివ్ నోట్‌లో ట్రేడింగ్ ముగించింది.

కంపెనీ వార్షిక సర్వసభ్య సమావేశంలో గౌతమ్ అదానీ షేర్ హోల్డర్లను ఉద్దేశించి ప్రసంగించడంతో మంగళవారం అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్లు దాదాపు 4 శాతం పెరిగాయి. ఏసీసీ మినహా అదానీ గ్రూపునకు చెందిన 8 స్టాక్స్ అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్, అదానీ పవర్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ట్రాన్స్ మిషన్, అదానీ టోటల్, అదానీ విల్మర్, అంబుజా సిమెంట్స్ దాదాపు 1 శాతం లాభపడ్డాయి. హిండెన్‌బర్గ్ నివేదిక తప్పుడు సమాచారంపై ఆధారపడి ఉందని మరియు ఉద్దేశపూర్వకంగా అదానీ గ్రూప్‌ను లక్ష్యంగా చేసుకుని పరువు తీయడానికి చేస్తున్న ప్రయత్నమని అదానీ పేర్కొంది. అదానీ ఎంటర్‌ప్రైజెస్ వార్షిక సాధారణ సమావేశంలో 'వర్చువల్' మోడ్ ద్వారా అదానీ ప్రసంగించారు. యాజమాన్యంపై హిండెన్‌బర్గ్ ఆరోపణలను దురుద్ధేశపూర్వకమైనవంటూ ఖండించారు.
NSEలో ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్స్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, రిలయన్స్, హీరో మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా కన్జూమర్, టెక్ మహీంద్రా, బజాజ్ ఆటో, ఎల్ టి, బజాజ్ ఫిన్ సర్వ్, ఎన్టీపీసీ, ఓఎన్జీసీ, అదానీ ఎంటర్ ప్రైజెస్, ఎస్బీఐ లైఫ్, పవర్ గ్రిడ్, ఐషర్ మోటార్స్, ఐటీసీ, టీసీఎస్ కంపెనీల షేర్లు లాభాల్లో ట్రేడింగ్ ముగిసి టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో ఎల్ టిఐఎమ్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎస్బీఐ, బ్రిటానియా, టైటాన్, బజాజ్ ఫైనాన్స్, టాటా మోటార్స్, సన్ ఫార్మా, అపోలో హాస్పిటల్స్, అల్ట్రాటెక్ సిమెంట్స్, టాటా స్టీల్, దివీస్ ల్యాబ్స్, కోల్ ఇండియా, గ్రాసిమ్, డాక్టర్ రెడ్డీస్, జేఎస్డబ్ల్యూ స్టీల్, బీపీసీఎల్, యూపీఎల్, హిందాల్కొ, నెస్లే కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ ముగించి టాప్ లూజర్లుగా క్లోజ్ అయ్యాయి.


Click it and Unblock the Notifications