Stock Market: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ.. ఇన్వెస్టర్లను ముంచిన ఐటీ స్టాక్స్..
Market Closing: ఉదయం ఒడిదొడుకుల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు చివరికి మంచి లాభాలతో తమ ప్రయాణాన్ని ముగించాయి. అయితే ఇంట్రాడేలో ప్రధానంగా మెటల్, పవర్ కంపెనీల షేర్లు లాభపడగా.. ఐటీ కంపెనీలు సూచీల నష్టాలకు కారణమయ్యాయి.
మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 230 పాయింట్ల లాభంలో ఉండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 92 పాయింట్ల మేర లాభపడింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 233 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 293 పాయింట్ల లాభంతో పాజిటివ్ క్లోజింగ్ నమోదు చేసింది. గతవారం నష్టాల తర్వాత కొత్త వారంలో మార్కెట్ సూచీలు సానుకూలంగా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి.

ఎన్ఎస్ఈలో దివీస్ ల్యాబ్, హీరో మోటార్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్, ఎన్టీపీసీ, ఓఎన్జీసీ, గ్రాసిమ్, అపోలో హాస్పిటల్స్, విప్రో, బజాజ్ ఆటో, బ్రిటానియా, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా స్టీల్, కోటక్ బ్యాంక్, టాటా కన్జూమర్, హిందాల్కొ, ఏషియన్ పెయింట్స్, బీపీసీఎల్, ఎయిర్ టెల్ సహా మరిన్ని కంపెనీల షేర్లు లాభాలతో ముందుకు సాగుతూ టాప్ గెయినర్లుగా నేడు ప్రయాణాన్ని ముగించాయి.
ఇదే క్రమంలో బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వ్, ఇన్ఫోసిస్, టీసీఎస్, టాటా మోటార్స్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, జేఎస్డబ్ల్యూ స్టీల్, అదానీ పోర్ట్స్, సన్ ఫార్మా కంపెనీల షేర్లు నష్టపోయి నేడు టాప్ లూజర్లుగా తమ ప్రయాణాన్ని ముగించాయి.


Click it and Unblock the Notifications