Market Closing: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు తమ ప్రయాణాన్ని భారీ లాభాల్లో ముగించాయి. ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ గోల్డ్‌మాన్ సాక్స్ రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ షేర్లకు బై రేటింగ్ ఇస్తూ టార్గెట్ ధరను 54 శాతం పెంచటంతో స్టాక్ పరుగులు తీసింది.
మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 526 పాయింట్ల లాభంలో ఉండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 119 పాయింట్ల మేర లాభపడింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 186 పాయింట్ల లాభంలో ఉండగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం 30 పాయింట్ల మేర లాభపడింది. ఈ క్రమంలో నేడు రియల్టీ, ఆటో, క్యాపిటల్ గూడ్స్ రంగాల షేర్లలో కొనసాగిన కొనుగోళ్ల జోరు మార్కెట్లను లాభాల బాట పట్టించింది.

ఎన్ఎస్ఈలో రిలయన్స్, మారుతీ, బజాజ్ ఆటో, బజాజ్ ఫైనాన్స్, టైటాన్, అదానీ పోర్ట్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కోటక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎయిర్ టెల్, ఎల్ టి, సన్ ఫార్మా, ఏషియన్ పెయింట్స్, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఎన్టీపీసీ, ఐటీసీ, టాటా స్టీల్ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా తమ ప్రయాణాన్ని నేడు చివరికి ముగించాయి.
ఇదే క్రమంలో యూపీఎల్, హీరో మోటార్స్, విప్రో, అపోలో హాస్పిటల్స్, డాక్టర్ రెడ్డీస్, టాటా కన్జూమర్, గ్రాసిమ్, ఎల్ టిఐఎమ్, కోల్ ఇండియా, హెచ్సీఎల్ టెక్నాలజీస్, బ్రిటానియా, దివీస్ ల్యాబ్, టాటా మోటార్స్, నెస్లే, టీసీఎస్, బజాజ్ ఫిన్ సర్వ్, బీపీసీఎల్, ఎస్బీఐ,ఇన్ఫోసిస్, జేఎస్డబ్యూ స్టీల్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా తమ ప్రయాణాన్ని నేడు ముగించాయి.


Click it and Unblock the Notifications