Stock Market: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. ర్యాలీలో స్మాల్ అండ్ మిడ్‌క్యాప్స్..

Market Closing: ఉదయం స్వల్ప లాభాలతో మెుదలైన దేశీయ స్టాక్ మార్కెట్లు చివరికి సానుకూలంగానే ప్రయాణాన్ని ముగించాయి. అయితే ఇంట్రాడేలో ఇండియా విక్స్ ఓలటాలిటీ 5 శాతాన్ని తాకింది. నేడు రియల్టీ అండ్ బ్యాంకింగ్ స్టాక్స్ నష్టాల్లో ప్రయాణాన్ని ముగించాయి.

మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 128 పాయింట్లు లాభపడగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 43 పాయింట్ల మేర స్వల్ప లాభంతో తన ప్రయాణాన్ని ముగించాయి.ఈ క్రమంలో బ్యాంక్ నిఫ్టీ సూచీ మాత్రం 166 పాయింట్లను కోల్పోయింది. చివరిగా నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 247 పాయింట్లు లాభంలో ఉంది. మార్కెట్లను ముందుకు నడపటంలో ఆటో, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్ స్టాక్స్ 1 శాతం లాభపడి నేడు లాభాల ముగింపుకు దోహదపడ్డాయి.

Indian stock Markets closed positive as finance banking stocks closed red

ఎన్ఎస్ఈలో బీపీసీఎల్, పవర్ గ్రిడ్, ఏషియన్ పెయింట్స్, టాటా మోటార్స్, బజాజ్ ఆటో, ఎస్బీఐ లైఫ్, టాటా స్టీల్, ఎన్టీపీసీ, సిప్లా, మహీంద్రా అండ్ మహీంద్రా, అదానీ పోర్ట్స్, శ్రీరామ్ ఫైనాన్స్, టీసీఎస్, డాక్టర్ రెడ్డీస్, సన్ ఫార్మా, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఐటీసీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, గ్రాసిమ్, ఎస్బీఐ కంపెనీల షేర్లు నేడు తమ ప్రయాణాన్ని లాభాల్లో ముగించాయి.

ఇదే క్రమంలో కోటక్ బ్యాంక్, టాటా కన్జూమర్, ఎయిర్ టెల్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ లైఫ్, దివీస్ ల్యాబ్, విప్రో, ఐసీఐసీఐ బ్యాంక్, అదానీ ఎంటర్ ప్రైజెస్, ఇండస్ఇండ్ బ్యాంక్, కోల్ ఇండియా, టైటాన్, బజాజ్ ఫైనాన్స్, మారుతీ, బ్రిటానియా, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఎల్‌టిఐఎమ్, ఇన్ఫోసిస్, హిందుస్థాన్ యూనీలివర్, ఓఎన్జీసీ కంపెనీల షేర్లు నష్టాల్లో ప్రయాణాన్ని నేడు ముగించాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+