Stock Market: నష్టాల నుంచి తేరుకున్న Sensex, Nifty.. లాభాల్లో ముగిసిన మార్కెట్లు..
Closing Bell: దేశీయ స్టాక్ మార్కెట్లలో అనూహ్యంగా రికవరీ మోడ్ కనిపించింది. ప్రధానంగా స్మాల్ అండ్ మిడ్ క్యాప్ సూచీలు మంచి లాభాల్లో ప్రయాణాన్ని ముగించాయి. దీనికి తోడు ఐపీవోలు మార్కెట్లలో జోష్ నింపాయి.
మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 173 పాయింట్ల లాభంలో ఉండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 52 పాయింట్ల గెయిన్ తో నేడు ప్రయాణాన్ని ముగించాయి. ఉదయం మార్కెట్ల ఆరంభంలోని నష్టాలను చివరికి అధిగమించాయి. ఈ క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 36 పాయింట్ల నష్టపోగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ మాత్రం 302 పాయింట్ల లాభంతో ట్రేడింగ్ ముగించింది.

నేడు మార్కెట్లు ట్రేడింగ్ రెండో సెషన్లో లాభాల్లోకి రావటానికి యూరోపియన్ మార్కెట్లు పుంజుకోవటం ప్రధాన కారణంగా నిలిచింది. గ్లోబల్ వడ్డీ రేట్లు, పెరుగుతున్న చమురు ధరలపై ఆందోళనలు, ప్రీమియం వాల్యుయేషన్‌ను ధృవీకరించే ఆశాజనక ఆర్థిక వృద్ధి అవకాశాలు, బలమైన ఆదాయాల సంభావ్యత వంటి అనేక దేశీయ కారణాలు దీనికి దోహదపడ్డాయి. అలాగే ప్రపంచ సవాళ్లను అధిగమించేందుకు ఇన్వెస్టర్లు రక్షణాత్మక విధానాన్ని అవలంబించడంతో FMCG, ఫార్మా రంగాలు మెరుగైన పనితీరు కనబరిచాయి.
ఎన్ఎస్ఈలో ఎల్ టి, కోల్ ఇండియా, ఐటీసీ, సిప్లా, ఎల్ టిఐఎమ్, మారుతీ, రిలయన్స్, సన్ ఫార్మా, ఇండస్ఇండ్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, ఎస్బీఐ లైఫ్, అదానీ ఎంటర్ ప్రైజెస్, అపోలో హాస్పిటల్స్, యాక్సిస్ బ్యాంక్, హిందుస్థాన్ యూనీలివర్, డాక్టర్ రెడ్డీస్, ఎయిర్ టెల్, హిందాల్కొ, అల్ట్రాటెక్ సిమెంట్స్, బ్రిటానియా కంపెనీల షేర్లు లాభాలతో నేడు ప్రయాణాన్ని ముగించి టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో టైటాన్, గ్రాసిమ్, హీరో మోటార్స్, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, నెస్లే, బీపీసీఎల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బజాజ్ ఆటో, టాటా కన్జూమర్, టాటా స్టీల్, యూపీఎల్, బజాజ్ ఫైనాన్స్, ఎన్టీపీసీ, ఓఎన్జీసీ, బజాజ్ ఫిన్ సర్వ్, హెచ్సీఎల్ టెక్నాలజీస్ కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ ముగించి టాప్ లూజర్లుగా నిలిచాయి.


Click it and Unblock the Notifications