Stock Market: భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు.. విధ్వంసం సృష్టించిన అదానీ స్టాక్స్..
Closing Bell: ఉదయం స్వల్పంగా లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు ఆ తర్వాత భారీగా పుంజుకున్నాయి. ఈ క్రమంలో బ్యాంక్ నిఫ్టీ సూచీ కొత్త గరిష్ఠాలను తాకింది.
సాయంత్రం మార్కెట్లు ముగిసే సమయానికి బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 431 పాయింట్ల లాభంతో నిలవగా.. ఇదే క్రమంలో నిఫ్టీ సూచీ 168 పాయింట్ల లాభాన్ని నమోదు చేసింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 581 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 204 పాయింట్ల మేర లాభాన్ని నమోదు చేసింది. దీనికి తోడు అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు లాభాల విధ్వంసాన్ని సృష్టించాయి. అదానీ స్టాక్స్ దాదాపు 17 శాతం మేర లాభపడ్డాయి. దీంతో వాటి మార్కెట్ క్యాప్ రూ.14 లక్షల కోట్లను అధిగమించింది.

ఎన్ఎస్ఈలో అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పోర్ట్స్, పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ, ఎస్బీఐ, బీపీసీఎల్, ఐసీఐసీఐ బ్యాంక్, టైటాన్, మహీంద్రా అండ్ మహీంద్రా, గ్రాసిమ్, నెస్లే, మారుతీ, సన్ ఫార్మా, ఏషియన్ పెయింట్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్, యాక్సిస్ బ్యాంక్, టీసీఎస్, టాటా స్టీల్, ఎస్పీఐ లైఫ్, యూపీఎల్, బ్రిటానియా, కోటక్ బ్యాంక్, జేఎస్డబ్ల్యూ స్టీల్, సిప్లా, డాక్టర్ రెడ్డీస్ తో పాటు మరిన్ని కంపెనీల షేర్లు లాభాలతో తమ ప్రయాణాన్ని ముగించి టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో ఎల్ టిఐఎమ్, హిందుస్థాన్ యూనీలివర్, దివీస్ ల్యాబ్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, బజాజ్ ఆటో, ఐషర్ మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, విప్రో, ఇన్ఫోసిస్, ఇండస్ఇండ్ బ్యాంక్, అపోలో హాస్పిటల్స్, ఐటీసీ, హెచ్డీఎఫ్సీ లైఫ్, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఓఎన్జీసీ, టెక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, ఎయిర్ టెల్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా తమ ప్రయాణాన్ని ముగించాయి.


Click it and Unblock the Notifications