Closing Bell: దేశీయ స్టాక్ మార్కెట్లు చివరి రోజు ట్రేడింగ్ లాభాల్లో ముగించాయి. ప్రధాన సూచీలు సూపర్ లాభాల్లో ముగియటంతో పాటు అక్టోబర్ సిరీస్ F&Oపై ఇన్వెస్టర్లు మంచి ఆసక్తిని కనబరిచారు.
మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 320 పాయింట్ల లాభపడగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 115 పాయింట్ల మేర గెయిన్ అయ్యింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 284 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 433 పాయింట్ల మేర లాభాలతో సెప్టెంబర్ నెల చివరి రోజు ట్రేడింగ్ ఆశాజనకంగా ముగించాయి. ఈ క్రమంలో ప్రధానంగా ఫార్మా, మెటల్ రంగాల షేర్లు 2 శాతం మేర లాభపడ్డాయి.

ప్రపంచ మార్కెట్ల సానుకూల సూచనల సంకేతాలు నేడు భారత స్టాక్ మార్కెట్లు నిన్నటి నష్టాల నుంచి తేరుకునేందుకు దోహదపడ్డాయి. దీంతో నేడు ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మెుగ్గుచూపారు. ఈ క్రమంలో అన్ని BSE లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.3.28 లక్షల కోట్లు పెరిగి రూ.319.94 లక్షల కోట్లకు చేరుకుంది. ఈరోజు లాభపడిన వాటిలో హెవీ వెయిట్ కలిగిన రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐలు ఉన్నాయి.
ఎన్ఎస్ఈలో హిందాల్కొ, ఎన్టీపీసీ, డాక్టర్ రెడ్డీస్, హీరో మోటార్స్, టాటా మోటార్స్, దివీస్ ల్యాబ్స్, అపోలో హాస్పిటల్స్, సన్ ఫార్మా, ఓఎన్జీసీ, సిప్లా, యూపీఎల్, గ్రాసిమ్, టాటా స్టీల్, కోల్ ఇండియా, ఎస్బీఐ లైఫ్, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఎస్బీఐ, జేఎస్డబ్ల్యూ స్టీల్, బజాజ్ ఆటో, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా ట్రేడింగ్ ముగించాయి.
ఇదే క్రమంలో అదానీ ఎంటర్ ప్రైజెస్, ఎల్ టిఐఎమ్, ఇన్ఫోసిస్, టెచ్సీఎల్ టెక్నాలజీస్, నెస్లే, టెక్ మహీంద్రా, టీసీఎస్, టైటాన్, పవర్ గ్రిడ్, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫిన్ సర్వ్, మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ ముగించి టాప్ లూజర్లుగా వారాంతంలో నిలిచాయి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications