Market Closing: ఒడిదొడుకులను జయించిన సెన్సెక్స్, నిఫ్టీ- ఆ ఒక్కటే కాపాడింది..
Closing Bell: ఉదయం నుంచి భారీ ఒడిదొడుకుల మధ్య కొనసాగిన దేశీయ స్టాక్ మార్కెట్లు చివరికి కొంత లాభాలను చూశాయి. ఈ క్రమంలో నేడు స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ తో పాటు బ్యాంకింగ్ రంగానికి చెందిన షేర్లు నష్టాలను చూశాయి.
మార్కెట్ల ముగింపు సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 150 పాయింట్లు లాభపడగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 5 పాయింట్ల మేర లాభంతో నేడు ప్రయాణాన్ని ముగించాయి. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 105 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 334 పాయింట్ల నష్టంతో ప్రయాణాన్ని ముగించాయి. ప్రధానంగా నేడు మార్కెట్లలో ఐటీ రంగానికి చెందిన కంపెనీలు లాభాల జోరును కొనసాగించటంతో చివరికి కీలక సూచీలు నష్టాల నుంచి తప్పించుకోగలిగాయి.

ఎన్ఎస్ఈలో టీసీఎస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, మహీంద్రా అండ్ మహీంద్రా, విప్రో, బీపీసీఎల్, ఎయిర్ టెల్, టాటా మోటార్స్, ఎల్ టిఐఎమ్, ఎస్బీఐ, బజాజ్ ఆటో, ఐటీసీ, టైటాన్, ఎస్బీఐ లైఫ్, మారుతీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హిందాల్కొ, ఎన్టీపీసీ, బజాజ్ ఫైనాన్స్ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా తమ ప్రయాణాన్ని కొనసాగించాయి.
ఇదే క్రమంలో దివీస్ ల్యాబ్, హీరో మోటార్స్, కోల్ ఇండియా, అల్ట్రాటెక్ సిమెంట్స్, డాక్టర్ రెడ్డీస్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఓఎన్జీసీ, అదానీ ఎంటర్ ప్రైజెస్, టాటా స్టీల్, అదానీ పోర్ట్స్, ఐషర్ మోటార్స్, సిప్లా, పవర్ గ్రిడ్, టాటా కన్జూమర్, బజాజ్ ఫిన్ సర్వ్, అపోలో హాస్పిటల్స్, హిందుస్థాన్ యూనీలివర్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ కంపెనీల షేర్లు నష్టాలతో ప్రయాణాన్ని ముగించి టాప్ లూజర్లుగా నిలిచాయి.


Click it and Unblock the Notifications