Stock Market: భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు.. దుమ్మురేపిన BPCL..
Market Closing: దేశీయ స్టాక్ మార్కెట్లలో ప్రస్తుతం క్యూ-1 ఫలితాల కోలాహలం కొనసాగుతోంది. కంపెనీలు మెరుగైన లాభాలను విడుదల చేయటంతో ఇన్వెస్టర్లలో జోష్ నెలకొంది.
దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 352 పాయింట్ల లాభంలో ఉండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 93 పాయింట్ల లాభంతో ట్రేడింగ్ ముగించాయి. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 190 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 161 పాయింట్ల లాభంతో ట్రేడింగ్ ముగించాయి. ఇదే క్రమంలో మహీంద్రా గ్రూప్ ఆర్బీఎల్ బ్యాంకులో 4 శాతం వాటాను కొనుగోలు చేసింది. రానున్న కాలంలో వాటాలను పెంచుకోవచ్చని తెలుస్తోంది.

క్యూ-1 ఫలితాలను పరిశీలిస్తే ప్రభుత్వ పెట్రోలియం సంస్థ బీపీసీఎల్ నికర లాభం 63 శాతం పెరిగి రూ.10,551 కోట్లుగా నమోదైంది. ఇదే క్రమంలో బజాజ్ ఫైనాన్స్ సంస్థ విడుదల చేసిన ఫలితాలను పరిశీలిస్తే ఆదాయం 7 శాతం క్షీణించినప్పటికీ.. త్రైమాసికంలో రూ.10,644 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. అలాగే పంజాబ్ నేషనల్ బ్యాంక్ నికర లాభాన్ని పరిశీలిస్తే 307 శాతం పెరిగి రూ. 1,255.41 కోట్లుగా నమోదైంది.
ఎన్ఎస్ఈలో ఎల్ టి, సిప్లా, ఐటీసీ, బ్రిటానియా, సన్ ఫార్మా, రిలయన్స్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, ఇన్ఫోసిస్, యూపీఎల్, డాక్టర్ రెడ్డీస్, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎన్టీపీసీ, జేఎస్డబ్యూ స్టీల్, ఐషర్ మోటార్స్, విప్రో, టాటా స్టీల్, హిందుస్థాన్ యూనీలివర్ కంపెనీల షేర్లు లాభాల్లో ముగిసి టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వ్, మహీంద్రా అండ్ మహీంద్రా, అపోలో హాస్పిటల్స్, టెక్ మహీంద్రా, ఏషియన్ పెయింట్స్, దివీస్ ల్యాప్, ఎస్బీఐ లైఫ్, టైటాన్, అల్ట్రాటెక్ సిమెంట్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎల్ టిఐఎమ్, టీసీఎస్, హీరో మోటార్స్, మారుతీ, హిందాల్కొ, టాటా మోటార్స్, పవర్ గ్రిడ్ కంపెనీల షేర్లు నష్టాలతో ట్రేడింగ్ ముగించి టాప్ లూజర్లుగా నిలిచాయి.


Click it and Unblock the Notifications