Market Closing: ఉదయం సానుకూలంగా ప్రయాణం మెుదలుపెట్టిన దేశీయ స్టాక్ మార్కెట్లు చివరికి ఊహించని ర్యాలీకి కారణమయ్యాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు భారీ ర్యాలీని కొనసాగించాయి. ఈ క్రమంలో రియల్టీ, ఎఫ్ఎంసీజీ, మెటల్ రంగాలు మినహా అన్ని రంగాల్లోనూ కొనుగోళ్ల కోలాహలం కొనసాగింది.
మార్కెట్ల ముగింపు సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 938 పాయింట్ల లాభంలో ఉండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 224 పాయింట్ల మేర వృద్ధి చెందింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 1223 పాయింట్ల మెగా ర్యాలీని నమోదు చేయగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 210 పాయింట్లతో తమ ప్రయాణాన్ని ముగించాయి. ప్రధానంగా ఫైనాన్స్ రంగాల షేర్లలో ర్యాలీతో పాటు ప్రపంచ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల పవనాలు దీనికి కారణంగా ఉన్నాయి.

ఎన్ఎస్ఈలో ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎస్బీఐ, అల్ట్రాటెక్ సిమెంట్స్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, గ్రాసిమ్, ఎన్టీపీసీ, బీపీసీఎల్, బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టీసీఎస్, సన్ ఫార్మా, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, నెస్లే, ఎల్ టి, రిలయన్స్, ఎయిర్ టెల్ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా నేడు తమ ప్రయాణాన్ని ముగించాయి.
ఇదే క్రమంలో హెచ్సీఎల్ టెక్నాలజీస్, అపోలో హాస్పిటల్స్, బజాజ్ ఆటో, హెచ్డీఎఫ్సీ లైఫ్, హీరో మోటార్స్, ఎల్ టిఐఎమ్, దివీస్ ల్యాబ్స్, ఐషర్ మోటార్స్, అదానీ పోర్ట్స్, కోల్ ఇండియా, ఐటీసీ, శ్రీరామ్ ఫైనాన్స్, విప్రో, టాటా కన్జూమర్, బ్రిటానియా, బజాజ్ ఫిన్ సర్వ్, మారుతీ, అదానీ ఎంటర్ ప్రైజెస్ కంపెనీల షేర్లు నేడు తమ ప్రయాణాన్ని టాప్ లూజర్లుగా నష్టాల్లో ముగించాయి.


Click it and Unblock the Notifications