Market Closing: ఫెడ్ ప్రకటన తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్లు తిరిగి లాభాల్లోకి పుంజుకున్నాయి. నేడు స్మాల్ అండ్ మిడ్ క్యాప్ సూచీలు చాలా కాలం తర్వాత మంచి పనితీరును కనబరిచాయి.
సాయంత్రం మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 539 పాయింట్ల లాభంలో ఉండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 173 పాయింట్లు లాభపడింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 374 పాయింట్ల లాభంలో, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 1114 పాయింట్ల మేర భారీ లాభాన్ని నేడు నమోదు చేసింది. కన్‌స్ట్రక్షన్, మెటల్స్, పీఎస్‌యూ బ్యాంకులు, మీడియా & ఎంటర్‌టైన్‌మెంట్, ఎనర్జీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఫార్మా రంగాల షేర్లు నేడు లాభాల్లో కొనసాగాయి.

ఎన్ఎస్ఈలో ఎన్టీపీసీ, బీపీసీఎల్, పవర్ గ్రిడ్, టాటా స్టీల్, కోల్ ఇండియా, ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా మోటార్స్, సిప్లా, హిందాల్కొ, జేఎస్డబ్ల్యూ స్టీల్, గ్రాసిమ్, ఐషర్ మోటార్స్, విప్రో, ఎల్ టి, అదానీ పోర్ట్స్, ఐటీసీ, మహీంద్రా అండ్ మహీంద్రా, టెక్ మహీంద్రా, బజాజ్ ఆటో, అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ షేర్లు నేడు లాభాలతో టాప్ గెయినర్లుగా తమ ప్రయాణాన్ని ముగించాయి.
ఇదే క్రమంలో ఎయిర్ టెల్, హెచ్డీఎఫ్సీ లైఫ్, మారుతీ, ఐసీఐసీఐ బ్యాంక్, ఓఎన్జీసీ, ఏషియన్ పెయింట్స్, నెస్లే, బ్రిటానియా, కోటక్ బ్యాంక్, అపోలో హాస్పిటల్స్ షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా తమ ప్రయాణాన్ని ముగించాయి.


Click it and Unblock the Notifications