Market Closing: ఉదయం లాభాల్లో మెుదలై కొద్దిసేపటికే నష్టాల్లోకి జారుకున్న స్టాక్ మార్కెట్లు చివరికి లాభాల్లో నేడు ప్రయాణాన్ని ముగించాయి. వాస్తవానికి ఇంట్రాడేలో ఎనర్జీ, ఆటో రంగాల షేర్లలో నమోదైన కొనుగోళ్ల కోలాహలం మార్కెట్ల తీరుతెన్నులను పూర్తిగా మార్చేశాయి.
మార్కెట్ల క్లోజింగ్ సమయానికి బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 328 పాయింట్లు లాభపడగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 114 పాయింట్లు పెరిగింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 105 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 490 పాయింట్ల భారీ లాభంతో తమ ప్రయాణాన్ని సానుకూలంగా ముగించాయి. దీంతో వరుసగా మూడో రోజు దేశీయ స్టాక్ మార్కెట్లు తమ ప్రయాణాన్ని లాభాల్లో ముగించాయి.

ఎన్ఎస్ఈలో అదానీ ఎంటర్ ప్రైజెస్, మహీంద్రా అండ్ మహీంద్రా, హీరో మోటార్స్, ఓఎన్జీసీ, ఎల్ టి, జేఎస్డబ్ల్యూ స్టీల్, హిందాల్కొ, అదానీ పోర్ట్స్, ఐషర్ మోటార్స్, సన్ ఫార్మా, ఎన్టీపీసీ, రిలయన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఎస్బీఐ, టైటాన్, విప్రో, శ్రీరామ్ ఫైనాన్స్, టెక్ మహీంద్రా, కోల్ ఇండియా కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా నేడు తమ ప్రయాణాన్ని ముగించాయి.
ఇదే క్రమంలో సిప్లా, టీసీఎస్, టాటా కన్జూమర్, నెస్లే, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్, బజాజ్ ఫైనాన్స్, ఐటీసీ, ఏషియన్ పెయింట్స్, దివీస్ ల్యాబ్, హిందుస్థాన్ యూనీలివర్, గ్రాసిమ్, బజాజ్ ఫిన్ సర్వ్ కంపెనీల షేర్లు నష్టాలతో నేడు టాప్ లూజర్లుగా చివరికి తమ ప్రయాణాన్ని ముగించాయి.


Click it and Unblock the Notifications