Closing Bell: ఉదయం ట్రేడింగ్ సెషన్లో ఒడిదొడుకులకు లోనైన దేశీయ స్టాక్ మార్కెట్లు మార్కెట్లు ముగింపు నాటికి పుంజుకున్నాయి. మెటల్ రంగంలోని కంపెనీల షేర్లు ఉత్తమ పనితీరుతో చివరికి లాభాల్లో ప్రయాణాన్ని ముగించాయి.
మార్కెట్లు ముగింపు సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 141 పాయింట్ల లాభంలో ఉండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 51 పాయింట్లు గెయిన్ అయ్యింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 385 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 522 పాయింట్ల లాభంతో క్లోజ్ అయ్యాయి. నిన్న నష్టాల్లో ముగిసిన మిడ్ క్యాప్ సూచీ నేడు తిరిగి పుంజుకోవటం ఇన్వెస్టర్లలో కొత్త సంతోషాన్ని నింపింది. భారత రూపాయి బుధవారం నాటి ముగింపు 83.45తో పోలిస్తే గురువారం డాలర్‌కు 83.64 వద్ద రికార్డు ముగింపు వద్ద ముగిసింది.

ఎన్ఎస్ఈలో హిందాల్కొ, గ్రాసిమ్, జేఎస్డబ్ల్యూ స్టీల్, బీపీసీఎల్, అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, కోల్ ఇండియా, రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్, ఎల్ టి, హిందుస్థాన్ యూనీలివర్, టెక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, ఎస్బీఐ లైఫ్, శ్రీరామ్ ఫైనాన్స్, ఎల్ టిఐఎమ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, దివీస్ ల్యాబ్ కంపెనీల షేర్లు లాభాలతో నేడు టాప్ గెయినర్లుగా తమ ప్రయాణాన్ని ముగించాయి.
ఇదే క్రమంలో హీరో మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, సన్ ఫార్మా, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎన్టీపీసీ, విప్రో, సిప్లా, ఎస్బీఐ, ఎయిర్ టెల్, మారుతీ, బజాజ్ ఆటో, పవర్ గ్రిడ్, టైటాన్, అల్ట్రాటెక్ సిమెంట్స్, బజాజ్ ఫిన్ సర్వ్, టీసీఎస్, బజాజ్ ఫైనాన్స్, టాటా కన్జూమర్, అపోలో హాస్పిటల్స్, ఇండస్ఇండ్ బ్యాంక్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా నేడు తమ ప్రయాణాన్ని ముగించాయి.


Click it and Unblock the Notifications