Stock Market: భారీ నష్టాల నుంచి కోలుకున్న మార్కెట్లు.. లాభాల్లో సెన్సెక్స్, నిఫ్టీ క్లోజ్..
Market Closing: ఉదయం నష్టాలతో ప్రారంభమై భారీ క్షీణతను నమోదు చేసిన సూచీలు ఇంట్రాడేలో తిరిగి కోలుకున్నాయి. ఈ క్రమంలో చివరికి స్వల్ప లాభాలతో ముగిసి ఇన్వెస్టర్లకు ఊరటను కలిగించాయి.
మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 34 పాయింట్ల లాభంతో ఉండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 20 పాయింట్ల మేర లాభంతో తన ప్రయాణాన్ని ముగించింది. ఇదే సమయంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ స్వల్పంగా 5 పాయింట్ల నష్టంతో ఉండగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ మాత్రం అత్యధికంగా 392 పాయింట్ల మేర లాభంతో తన ప్రయాణాన్ని ముగించింది. ఈ క్రమంలో ఆటో, పవర్, ఫార్మా రియల్టీ రంగాలు లాభాల ర్యాలీని కొనసాగించాయి.

NSEలో ఎన్టీపీసీ, అదానీ పోర్ట్స్, హీరో మోటార్స్, పవర్ గ్రిడ్, ఐషర్ మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎల్ టి, హిందాల్కొ, సిప్లా, సన్ ఫార్మా, బజాజ్ ఆటో, ఎస్బీఐ, అదానీ ఎంటర్ ప్రైజెస్, టాటా స్టీల్, టైటాన్, డాక్టర్ రెడ్డీస్, టాటా కన్జూమర్, టాటా మోటార్స్, మారుతీ, ఐటీసీ, హిందుస్థాన్ యూనీలివర్, దివీస్ ల్యాబ్స్, బ్రిటానియా, ఇండస్ఇండ్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, రిలయన్స్, ఎయిర్ టెల్, నెస్లే, అపోలో హాస్పిటల్స్, యూపీఎల్, కోటక్ బ్యాంక్ కంపెనీలు లాభాలతో తమ ప్రయాణాన్ని ముగించాయి.
ఇదే క్రమంలో టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ లైఫ్, యాక్సిస్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఓఎన్జీసీ, బజాజ్ ఫిన్ సర్వ్, ఎస్బీఐ లైఫ్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, జేఎస్డబ్ల్యూ స్టీల్, కోల్ ఇండియా, విప్రో, ఐసీఐసీఐ బ్యాంక్, గ్రాసిమ్, ఎల్ టిఐఎమ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బీపీసీఎల్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా తమ ప్రయాణాన్ని ముగించాయి.


Click it and Unblock the Notifications