Stock Market: కొనుగోళ్ల కోలాహలంతో లాభాల్లో సెన్సెక్స్-నిఫ్టీ.. నిపుణుల హెచ్చరిక అదే..
Market Closing: రెండు రోజుల వరుస నష్టాల తర్వాత నేడు దేశీయ స్టాక్ మార్కెట్లు తిరిగి లాభాల్లో ప్రయాణాన్ని ముగించాయి. వాస్తవానికి షేర్లలో కనిపించిన కొనుగోళ్ల కోలాహలం కారణం.
మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 336 పాయింట్ల మేర లాభపడగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 149 పాయింట్లు గెయిన్ అయ్యింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 192 పాయింట్లు నష్టపోయింది. ఈ సమయంలో నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 930 పాయింట్లు లాభపడి పెద్ద ఊరటను అందించింది. ఇదే క్రమంలో స్మాల్ క్యాప్ సూచీ 493 పాయింట్ల వృద్ధిని నమోదు చేసింది.

మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నప్పటికీ వీటిని చూసి భారీ బెట్టింగులు వేసే సాహసం చేయెుద్దని నిపుణులు రిటైల్ ఇన్వెస్టర్లను హెచ్చరిస్తున్నారు. ఇదే క్రమంలో నేడు రైల్వే సెక్టార్ లోని IRFC, Railtel, RVNL షేర్లు దాదాపు 11 శాతం పెరిగి లాభాల్లోకి బౌన్స్‌బ్యాక్ అయ్యాయి.
ఎన్ఎస్ఈలో అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పోర్స్, హిందాల్కొ, హీరో మోటార్స్, ఓఎన్జీసీ, హెచ్సీఎల్ టెక్నాలజీస్, కోల్ ఇండియా, విప్రో, యూపీఎల్, టాటా కన్జూమర్, సిప్లా, బ్రిటానియా, గ్రాసిమ్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎల్ టి, బీపీసీఎల్, మహీంద్రా అండ్ మహీంద్రా, టీసీఎల్ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా నేడు తమ ప్రయాణాన్ని ముగించాయి.
ఇదే క్రమంలో యాక్సిస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఎస్బీఐ, ఐటీసీ, టాటా స్టీల్, బజాజ్ ఫిన్ సర్వ్, టాటా మోటార్స్, డాక్టర్ రెడ్డీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, మారుతీ, ఎన్టీపీసీ కంపెనీల షేర్లు నష్టాల్లో నేడు ట్రేడింగ్ ముగించాయి.


Click it and Unblock the Notifications