Market Closing: ఉదయం ఒడిదొడుకుల్లో మెుదలైన దేశీయ స్టాక్ మార్కెట్లు చివరికి లాభాల్లో ప్రయాణాన్ని ముగించాయి. ఈ క్రమంలో నేడు ఇన్సూరెన్స్ వ్యాపారంలో ఉన్న కంపెనీల షేర్లు దాదాపు 1-3 శాతం మధ్య వృద్ధిని నమోదు చేశాయి.
మార్కెట్లు ముగిసే సమయానికి బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 66 పాయింట్ల లాభంలో ఉండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 27 పాయింట్ల మేర లాభంతో క్లోజ్ అయ్యింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 159 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 96 పాయింట్ల మేర లాభపడ్డాయి. ఒడిదొడుకులు ఉన్నప్పటికీ కీలక సూచీలు తమ ప్రయాణాన్ని ముందుకు కొనసాగిస్తూనే ఉన్నాయి.

ఎన్ఎస్ఈలో ఎన్టీపీసీ, హెచ్డీఎఫ్సీ లైఫ్, పవర్ గ్రిడ్, ఓఎన్జీసీ, బీపీసీఎల్, బజాజ్ ఆటో, డాక్టర్ రెడ్డీస్, కోల్ ఇండియా, రిలయన్స్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్ సర్వ్, టెక్ మహీంద్రా, హీరో మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎయిర్ టెల్, హిందాల్కొ, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, సన్ ఫార్మా, అదానీ పోర్ట్స్ కంపెనీల షేర్లు నేడు మార్కెట్ల ముగింపులో టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో ఐషర్ మోటార్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఎస్బీఐ లైఫ్, మహీంద్రా అండ్ మహీంద్రా, బ్రిటానియా, ఎల్ టిఐఎమ్, టాటా స్టీల్, అపోలో హాస్పిటల్స్, ఇన్ఫోసిస్, అల్ట్రాటెక్ సిమెంట్స్, టైటాన్, దివీస్ ల్యాబ్, ఏషియన్ పెయింట్స్, సిప్లా, ఐటీసీ, టీసీఎస్, హెచ్సీఎల్ టెక్, విప్రో, ఎల్ టి, గ్రాసిమ్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా తమ ప్రయాణాన్ని ముగించాయి.


Click it and Unblock the Notifications