Stock Market: సూపర్ లాభాల్లో ముగిసిన మార్కెట్లు.. సెన్సెక్స్, నిఫ్టీ అప్ అందుకే..
Market Closing: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు ఊగిసలాటతో ప్రారంభమై చివరికి లాభాల్లో తమ ప్రయాణాన్ని ముగించాయి. ప్రధానంగా నిఫ్టీ, సెన్సెక్స్ సూచీల పెరుగుదలకు బ్యాంకింగ్ స్టాక్స్ నేడు దోహదపడ్డాయి.
మార్కెట్లు ముగిసే సమయానికి బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 483 పాయింట్ల లాభంలో ఉండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 127 పాయింట్ల మేర లాభపడ్డాయి. ఇదే క్రమంల నిఫ్టీ బ్యాంక్ సూచీ 620 పాయింట్ల మేర లాభపడగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ నష్టాల నుంచి తేరుకుని 160 పాయింట్ల మేర గెయిన్ అయ్యింది. రానున్న కాలంలో బ్యాంకింగ్ స్టాక్స్ కొంత కన్సాలిడేషన్ చూడొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే నేడు ప్రభుత్వ యాజమాన్యంలోని రైల్వే కంపెనీల షేర్లు క్షీణతను నమోదు చేశాయి.

ఎన్ఎస్ఈలో కోల్ ఇండియా, యూపీఎల్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ లైఫ్, విప్రో, అపోలో హాస్పిటల్స్, ఎస్బీఐ లైఫ్, అదానీ పోర్ట్స్, ఎన్టీపీసీ, కోటక్ బ్యాంక్, టాటా కన్జూమర్, హీరో మోటార్స్, సిప్లా, టెక్ మహీంద్రా, బజాజ్ ఆటో, ఎల్ టిఐఎమ్, ఇండస్ఇండ్ బ్యాంక్, మారుతీ, ఓఎన్జీసీ కంపెనీల షేర్లు లాభాలతో ప్రయాణాన్ని ముగించి టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో హిందాల్కొ, గ్రాసిమ్, దివీస్ ల్యాబ్, అల్ట్రాటెక్ సిమెంట్స్, బీపీసీఎల్, టైటాన్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్, డాక్టర్ రెడ్డీస్, నెస్లే, హెచ్సీఎల్ టెక్నాలజీస్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా నిలిచాయి.


Click it and Unblock the Notifications