Stock Market: భారీ లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. అదరగొట్టిన స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్
Market Closing: దేశీయ స్టాక్ మార్కెట్లు తమ బుల్ జోరును ఉదయం నుంచి స్థిరంగా కొనసాగించి చివరికి లాభాల్లో ముగిశాయి. ప్రధానంగా అమెరికా, ఆసియా మార్కెట్లతో పాటు గ్లోబల్ మార్కెట్ల బులిష్ సెంటిమెంట్లు నేడు భారతీయ మార్కెట్లను సానుకూలంగా డ్రైవ్ చేశాయి.
మార్కెట్ల ముగింపు సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 378 పాయింట్ల లాభంలో ఉండగా మరో కీలక సూచీ నిఫ్టీ 126 పాయింట్ల మేర లాభంతో నేడు ప్రయాణాన్ని ముగించాయి. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 435 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 487 పాయింట్ల మేర గెయిన్ అయ్యాయి.ఈ క్రమంలో ప్రధానంగా ఫైనాన్షియల్ రంగానికి చెందిన కంపెనీ షేర్లు మంచి ర్యాలీని నమోదు చేశాయి.

ఎన్ఎస్ఈలో ఎస్బీఐ లైఫ్, హెచ్డీఎఫ్సీ లైఫ్, బజాజ్ ఫిన్ సర్వ్, ఇండస్ఇండ్ బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్, టెక్ మహీంద్రా, హిందాల్కొ, గ్రాసిమ్, బజాజ్ ఫైనాన్స్, కోటక్ బ్యాంక్, ఐషర్ మోటార్స్, బీపీసీఎల్, యాక్సిస్ బ్యాంక్, హీరో మోటార్స్, దివీస్ ల్యాబ్, సన్ ఫార్మా, విప్రో, నెస్లే, ఎన్టీపీసీ, డాక్టర్ రెడ్డీస్ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా నేడు నిలిచాయి.
ఇదే క్రమంలో ఎయిర్ టెల్, ఓఎన్జీసీ, అపోలో హాస్పిటల్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్, సిప్లా, ఐటీసీ, టాటా కన్జూమర్, అదానీ పోర్ట్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్స్, టాటా స్టీల్, టాటా మోటార్స్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా నేడు తమ ప్రయాణాన్ని ముగించాయి.


Click it and Unblock the Notifications