Closing Bell: దేశీయ స్టాక్ మార్కెట్లు రోజంతా ఓలటాలిటీలో కొనసాగాయి. ఉదయం భారీ నష్టాల్లోకి జారుకున్న ప్రధాన సూచీలు మార్కెట్లు ముగిసే నాటికి కొంత మేర కోలుకున్నాయి.
మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 316 పాయింట్లు కోల్పోగా, మరో కీలక సూచీ నిఫ్టీ 110 పాయింట్ల నష్టంతో ప్రయాణాన్ని ముగించింది. ఇదే క్రమంలో బ్యాంక్ నిఫ్టీ సూచీ 186 పాయింట్ల నష్టపోగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం వీటికి భిన్నంగా 72 పాయింట్ల లాభంతో నేడు ట్రేడింగ్ ముగించాయి. ఈ క్రమంలో ప్రభుత్వ బ్యాంకులు, క్యాపిటల్ గూడ్స్ రంగాలు మెరుగైన పనితీరును కనబరిచాయి.

అమెరికా ఫెడరల్ రిజర్వ్ అధికారులు మరికొంత కాలం వడ్డీ రేట్లు అధికంగానే ఉంటాయని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో ఆసియా మార్కెట్లు దెబ్బతిన్నాయి. ఆసియా మార్కెట్లు క్షీణించాయి. జపాన్‌కు చెందిన నిక్కీ 1.6 శాతం క్షీణించగా, హాంకాంగ్‌లోని హ్యాంగ్‌సెంగ్ సూచీ 3.2 శాతం పడిపోయింది. గోల్డెన్ వీక్ సెలవుల కారణంగా చైనా మార్కెట్లు వారం రోజుల పాటు మూతపడ్డాయి. నేషనల్ సెక్యూరిటీస్ అండ్ డిపాజిటరీ లిమిటెడ్ డేటా ప్రకారం.. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు సెప్టెంబర్‌లో రూ.14,768 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. పైగా వారు కొనుగోళ్లను నిలిపివేశారని వెల్లడైంది.
ఎన్ఎస్ఈలో బజాజ్ ఫైనాన్స్, ఎల్ టి, టైటాన్, బజాజ్ ఫిన్ సర్వ్, అదానీ పోర్ట్స్, ఎస్బీఐ, ఇండస్ఇండ్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్స్, హెచ్సీఎల్ టెక్, ఏషియన్ పెయింట్స్, యాక్సిస్ బ్యాంక్, హిందుస్థాన్ యూనీలివర్, భారతీ ఎయిర్ టెల్ కంపెనీల షేర్లు లాభాల్లో తమ ప్రయాణాన్ని ముగించి నేడు టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో ఓఎన్జీసీ, ఐషర్ మోటార్స్, మారుతీ, హిందాల్కొ, డాక్టర్ రెడ్డీస్, ఎన్టీపీసీ, సన్ ఫార్మా, బీపీసీఎల్, టాటా మోటార్స్, యూపీఎల్, ఐసీఐసీఐ బ్యాంక్, జేఎస్డబ్ల్యూ స్టీల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, కోల్ ఇండియా, గ్రాసిమ్, హీరో మోటార్స్, రిలయన్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్, ఐటీసీ కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ ముగించి టాప్ లూజర్లుగా ఉన్నాయి.


Click it and Unblock the Notifications