Closing Bell: దలాల్ స్ట్రీట్‌లో బేర్స్ భూకంపం.. కాపాడిన ఆ మూడు రంగాలు..
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఎక్స్‌పెయిరీ డే రోజున ఫ్లాట్ ముగింపును నమోదు చేశాయి. మార్కెట్లు ముగింపు నాటికి ఆటో, ఆయిల్ అండ్ గ్యాస్, మీడియా రంగాలు భారీగా లాభపడ్డాయి.
మార్కెట్ల ముగింపు సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 109 పాయింట్లు నష్టపోగా, మరో కీలక సూచీ నిఫ్టీ 7 పాయింట్ల నష్టంతో నేడు ప్రయాణాన్ని ముగించింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 428 పాయింట్లు కోల్పోగా నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 131 పాయింట్లు పతనం అయింది. ఇదే క్రమంలో బీఎస్ఈ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ సూచీలు స్వల్ప నష్టాల్లో ప్రయాణాన్ని ముగించాయి. అలాగే బుధవారం నాటి ముగింపు 83.71తో పోలిస్తే గురువారం డాలర్‌తో రూపాయి మారకపు విలువ 83.70 వద్ద స్థిరపడింది.

ఎన్ఎస్ఈలో టాటా మోటార్స్, ఓఎన్జీసీ, బీపీసీఎల్, ఎస్బీఐ లైఫ్, ఎల్ టి, సన్ ఫార్మా, కోటక్ బ్యాంక్, విప్రో, హెచ్డీఎఫ్సీ లైఫ్, అదానీ ఎంటర్ ప్రైజెస్, బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టీసీఎస్, కోల్ ఇండియా, డాక్టర్ రెడ్డీస్, టెక్ మహీంద్రా, దివీస్ ల్యాబ్, అదానీ పోర్ట్స్, బజాజ్ ఆటో, పవర్ గ్రిడ్ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా నేడు తమ ప్రయాణాన్ని ముగించాయి.
ఇదే క్రమంలో యాక్సిస్ బ్యాంక్, నెస్లే, ఐసీఐసీఐ బ్యాంక్, టైటాన్, టాటా స్టీల్, శ్రీరామ్ ఫైనాన్స్, ఎల్ టిఐఎమ్, ఇండస్ఇండ్ బ్యాంక్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఐటీసీ, అపోలో హాస్పిటల్స్, టాటా కన్జూమర్, హిందాల్కొ, హీరో మోటార్స్, ఇన్ఫోసిస్, ఐషర్ మోటార్స్, ఎయిర్ టెల్, ఎస్బీఐ, హిందుస్థాన్ యూనీలివర్, ఏషియన్ పెయింట్స్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా తమ ప్రయాణాన్ని ముగించాయి.


Click it and Unblock the Notifications