Stock Market: నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. అంతా రిజర్వు బ్యాంక్ మాయేనా..?
Stock Market: రిజర్వు బ్యాంక్ మానిటరీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, రానున్న కాలానికి అంచనాలను ప్రకటించిన నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి.
మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 308 పాయింట్లు నష్టపోగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 89 పాయింట్ల మేర క్షీణతను నమోదు చేసింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 339 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ 29 పాయింట్ల మేర నష్టాల్లో ట్రేడింగ్ ముగించాయి. ఇంట్రాడే ట్రేడింగ్ సమయంలో పవర్, మెటల్ రంగాలు లాభపడగా.. బ్యాంకింగ్ రంగం షేర్లు నష్టాలను నమోదు చేశాయి.

ఎన్ఎస్ఈలో అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పోర్ట్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐటీసీ, ఓఎన్జీసీ, జేఎస్డబ్ల్యూ స్టీల్, మహీంద్రా అండ్ మహీంద్రా, బీపీసీఎల్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, పవర్ గ్రిడ్, రిలయన్స్, బజాజ్ ఫిన్ సర్వ్, దివీస్ ల్యాబ్స్, విప్రో, ఎల్ టిఐఎమ్, ఐషర్ మోటార్స్, ఎస్బీఐ కంపెనీల షేర్లు లాభాల్లో ట్రేడింగ్ ముగించి టాప్ గెయినర్లుగా నిలిచాయి.
అదే విధంగా ఏషియన్ పెయింట్స్, కోటక్ బ్యాంక్, బ్రిటానియా, ఐటీసీ, నెస్లే, అపోలో హాస్పిటల్స్, టాటా కన్జూమర్, ఎస్బీఐ లైఫ్, యాక్సిస్ బ్యాంక్, ఎయిర్ టెల్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ లైఫ్, బజాజ్ ఆటో, హీరో మోటార్స్, గ్రాసిమ్, సిప్లా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యూపీఎల్ కంపెనీ షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ ముగించి టాప్ లూజర్లుగా నిలిచాయి.


Click it and Unblock the Notifications