Closing Bell: దేశీయ స్టాక్ మార్కెట్లు ఉదయం నుంచి ఫ్లాట్ ట్రేడింగ్ కొనసాగించి చివిరికి స్వల్ప నష్టాల్లో తమ ప్రయాణాన్ని ముగించాయి. వాస్తవానికి గ్లోబల్ మార్కెట్లు బలహీనంగా ఉండటం దీనికి కారణంగా తెలుస్తోంది.
మార్కెట్ల ముగింపు సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 36 పాయింట్లు నష్టపోగా, మరో కీలక సూచీ నిఫ్టీ 4 పాయింట్ల నష్టంతో నేడు ప్రయాణాన్ని ముగించింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 235 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 201 పాయింట్లు కోల్పోయాయి. ఈ క్రమంలో బ్యాంకింగ్, స్మాల్ అండి మిడ్ క్యాప్ సూచీలు భారీగానే నష్టాన్ని చవిచూశాయి. అలాగే బడ్జెట్ ప్రసంగం దగ్గరపడుతున్న వేళ రైల్వే, ఇన్ ఫ్రా రంగాలకు చెందిన కంపెనీల షేర్లు లాభపడుతున్నాయి.

ఎన్ఎస్ఈలో ఓఎన్జీసీ, ఐటీసీ, హెచ్డీఎఫ్సీ లైఫ్, విప్రో, హిందుస్థాన్ యూనీలివర్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, టాటా కన్జూమర్, నెస్లే, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, రిలయన్స్, డాక్టర్ రెడ్డీస్, కోల్ ఇండియా, ఎయిర్ టెల్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐషర్ మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్, టెక్ మహీంద్రా, కోటక్ బ్యాంక్, బ్రిటానియా కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా తమ ప్రయాణాన్ని ముగించాయి.
ఇదే క్రమంలో టైటాన్, దివీస్ ల్యాబ్, బీపీసీఎల్, శ్రీరామ్ ఫైనాన్స్, అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, సిప్లా, ఏషియన్ పెయింట్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, అదానీ ఎంటర్ ప్రైజెస్, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఆటో, అల్ట్రాటెక్ సిమెంట్స్, సన్ ఫార్మా, బజాజ్ ఫైనాన్స్, హీరో మోటార్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఎస్బీఐ లైఫ్, గ్రాసిమ్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా నిలిచాయి.


Click it and Unblock the Notifications