Market Closing: దేశీయ స్టాక్ మార్కెట్లు తమ వరుస నష్టాల ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి. ఉదయం నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు సాయంత్రం దాదాపుగా ప్రారంభ స్థాయిల వద్దే ప్రయాణాన్ని ముగించాయి.
మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 232 పాయింట్లు నష్టపోగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 82 పాయింట్లను కోల్పోయింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 32 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ 454 పాయింట్లు పతనమయ్యాయి. స్మాల్ క్యాప్ సూచీ 0.7 శాతం మేర నష్టపోయింది. ప్రధానంగా నేడు అన్ని రంగాల సూచీలు నష్టాలతో తమ ప్రయాణాన్ని ముగించాయి.

NSEలో కోటక్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎస్బీఐ లైఫ్, టీసీఎస్, ఎన్టీపీసీ, నెస్లే, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టాటా కన్జూమర్, ఎయిర్ టెల్, హెచ్సీఎల్ టెక్, బజాజ్ ఆటో, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫిన్ సర్వ్, సన్ ఫార్మా కంపెనీల షేర్లు లాభాలతో తమ ప్రయాణాన్ని ముగించి టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో ఐటీసీ, టాటా స్టీల్, బీపీసీఎల్, దివీ ల్యాబ్స్, సిప్లా, హిందుస్థాన్ యూనీలివర్, హీరో మోటార్స్, యూపీఎల్, హిందాల్కొ, ఎస్బీఐ, గ్రాసిమ్, పవర్ గ్రిడ్, ఎల్ టి, యాక్సిస్ బ్యాంక్, జేఎస్డబ్ల్యూ స్టీల్, డాక్టర్ రెడ్డీస్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్, కోల్ ఇండియా, బజాజ్ ఫైనాన్స్ కంపెనీల షేర్లు నష్టాలతో తమ ప్రయాణాన్ని ముగించి టాప్ లూజర్లుగా నిలిచాయి.


Click it and Unblock the Notifications