Stock Market: ఆవిరైన మార్కెట్ లాభాలు.. నష్టాల్లో ముగిసిన వారాంతం.. ఎందుకంటే..
Stock Market: ఉదయం బుల్స్ జోరుతో తేరుకున్నట్లు కనిపించిన దేశీయ స్టాక్ మార్కెట్లలో మధ్యాహ్నానికి లాభాలు ఆవిరయ్యాయి. దీంతో వారాంతాన్ని వరుసగా నాలుగో రోజు నష్టాలతో మార్కెట్లు ముగించాయి.
బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 221 పాయింట్లు నష్టపోగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 68 పాయింట్లను కోల్పోయింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ చివరి క్షణాల్లో ఒడిదొడుకులతో స్వల్పంగా 12 పాయింట్ల నష్టపోగా.. మిడ్ క్యాప్ సూచీ 46 పాయింట్లు కోల్పోయాయి. కొద్ది రోజులుగా విదేశీ సంస్థాగత మదుపరులు రూ.12,140 కోట్ల విలువైన ఈక్విటీలను డంప్ చేశారు.

ఎన్ఎస్ఈలో ఇండస్ఇండ్ బ్యాంక్, మారుతీ, ఎస్బీఐ, మహీంద్రా అండ్ మహీంద్రా, ఏషియన్ పెయింట్స్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫిన్ సర్వ్, ఎల్ టి, కోల్ ఇండియా, హీరో మోటార్స్, టాటా కన్జూమర్, ఎల్ టిఐఎమ్, హెచ్డీఎఫ్సీ లైఫ్, టీసీఎస్, యాక్సిస్ బ్యాంక్, హిందుస్థాన్ యూనీలివర్, కోటక్ బ్యాంక్, నెస్లే, బ్రిటానియా, గ్రాసిమ్ కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతూ టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో విప్రో, డాక్టర్ రెడ్డీస్, యూపీఎల్, సిప్లా, బజాజ్ ఆటో, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్స్, పవర్ గ్రిడ్, దివీస్ ల్యాబ్, ఐటీసీ, సన్ ఫార్మా, ఎస్బీఐ లైఫ్, టాటా మోటార్స్, బీపీసీఎల్, అదానీ పోర్ట్స్, ఓఎన్జీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, అదానీ ఎంటర్ ప్రైజెస్, ఎయిర్ టెల్, టైటాన్ కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ ముగించి టాప్ లూజర్లుగా నిలిచాయి.


Click it and Unblock the Notifications