Closing Bell: నేడు దేశీయ స్టాక్ మార్కెట్లు ఉదయం ప్లాట్ ఆరంభంతో మెుదలైనప్పటికి చివరికి నష్టాల్లో ట్రేడింగ్ క్లోజ్ చేశాయి. అయితే ప్రధానంగా స్మాల్ అండ్ మిడ్ క్యాప్ సూచీలు మాత్రం లాభపడ్డాయి.
మార్కెట్ల క్లోజింగ్ సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 118 పాయింట్లు నష్టపోగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 17 పాయింట్ల మేర నష్టాన్ని నమోదు చేసింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 172 పాయింట్ల పతనాన్ని నేడు నమోదు చేసింది. అయితే నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం 483 పాయింట్ల లాభంతో నేడు ప్రయాణాన్ని ముగించింది. ప్రధానంగా దేశంలో కొనసాగుతున్న ఎన్నికల వాతావరణమే స్టాక్ మార్కెట్ల ఒడిదొడుకులకు కారణంగా ప్రముఖ ఇన్వెస్టర్ మార్క్ మెుబియస్ పేర్కొన్నారు.

ఎన్ఎస్ఈలో కోల్ ఇండియా, సిప్లా, బీపీసీఎల్, ఎయిర్ టెల్, పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ, మహీంద్రా అండ్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఎల్ టి, హిందాల్కొ, టాటా స్టీల్, అదానీ పోర్ట్స్, విప్రో, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, అదానీ ఎంటర్ ప్రైజెస్, ఎస్బీఐ, ఎల్ టిఐఎమ్, డాక్టర్ రెడ్డీస్, కోటక్ బ్యాంక్ కంపెనీల షేర్లు నేడు లాభాలతో టాప్ గెయినర్లుగా తమ ప్రయాణాన్ని ముగించాయి.
ఇదే క్రమంలో టాటా మోటార్స్, బజాజ్ ఆటో, ఏషియన్ పెయింట్స్, ఐషర్ మోటార్స్, బ్రిటానియా, టాటా కన్జూమర్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, జేఎస్డబ్ల్యూ స్టీల్, సన్ ఫార్మా, హెచ్డీఎఫ్సీ లైఫ్, హిందుస్థాన్ యూనీలివర్, నెస్లే, శ్రీరామ్ ఫైనాన్స్, టైటాన్, అల్ట్రాటెక్ సిమెంట్స్, టీసీఎస్, మారుతీ, బజాజ్ ఫిన్ సర్వ్, ఐటీసీ, ఇన్ఫోసిస్ కంపెనీల షేర్లు నష్టాలతో నేడు తమ ప్రయాణాన్ని క్లోజ్ చేశాయి.


Click it and Unblock the Notifications