Market Closing Bell: ఉదయం స్వల్ప నష్టాలతో ఫ్లాట్ ప్రారంభాన్ని నమోదు చేసిన స్టాక్ మార్కెట్లు చివరికి భారీగానే నష్టపోయాయి. కీలక స్టాక్స్ నష్టాల్లో ట్రేడ్ కావటం దీనికి కారణంగా తెలుస్తోంది.
మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 300 పాయింట్లు నష్టపోగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 79 పాయింట్ల నష్టంలో ట్రేడింగ్ ముగించింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 156 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 78 పాయింట్లను కోల్పోయింది. ఇదే క్రమంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లపై బ్రోకరేజ్ కంపెనీలు బులిష్ అంచనాలతో ఉన్నాయి. లాభాలు మార్కెట్లకు అనుగుణంగానే ఉన్నాయని వారు చెబుతున్నారు.

ప్రధానంగా మార్కెట్లు ముగిసే సమయానికి ఐటీసీ స్టాక్ టాప్ లూజర్ గా నిలిచింది. ఐటీసీ కంపెనీ డీమెర్జర్ ప్లాన్ ప్రకటనతో స్టాక్ కుప్పకూలింది. బోర్డు ఐటీసీ హోటల్స్ వ్యాపారాన్ని విడదీయాలని సూత్రప్రాయంగా ఆమోదించింది. ఆమోదించబడిన ప్రణాళిక ప్రకారం కొత్త ఎంటిటీ నేరుగా కంపెనీలో 60 శాతం మెజారిటీ వాటాను కలిగి ఉంటారని.. ITC లిమిటెడ్ దాదాపు 40% కలిగి ఉంటుందని వెల్లడించింది.
NSEలో ఎస్బీఐ లైఫ్, ఇండస్ఇండ్ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్, మహీంద్రా అండ్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్స్, పవర్ గ్రిడ్, బజాజ్ ఫిన్ సర్వ్, హీరో మోటార్స్, కోల్ ఇండియా, టాటా కన్జూమర్, అదానీ పోర్ట్స్, ఎల్ టి, ఏషియన్ పెయింట్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, టీసీఎస్, టాటా మోటార్స్, ఎన్టీపీసీ, గ్రాసిమ్, బజాజ్ ఆటో, ఎస్బీఐ కంపెనీల షేర్లు లాభాల్లో ట్రేడింగ్ ముగించి టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో ఐటీసీ, కోటక్ బ్యాంక్, టెక్ మహీంద్రా, రిలయన్స్, బ్రిటానియా, జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, ఎల్ టిఐఎమ్, హిందుస్థాన్ యూనీలివర్, అపోలో హాస్పిటల్స్, మారుతీ, నెస్లే, ఐసీఐసీఐ బ్యాంక్, యూపీఎల్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, హిందాల్కొ, విప్రో, ఐషర్ మోటార్స్, బీపీసీఎల్, యాక్సిస్ బ్యాంక్ కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ ముగించి టాప్ లూజర్లుగా నిలిచాయి.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications