Stock Market: మిశ్రమంగా ముగిసిన మార్కెట్లు.. ఇన్వెస్టర్లలో మరోసారి వడ్డీ రేట్ల భయాలు..!
Stock Market Closing: దేశీయ స్టాక్ మార్కెట్లు వారాంతంలో మిశ్రమంగా ముగిశాయి. బెంచ్ మార్క్ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీ మాత్రం స్వల్పంగా లాభాల్లో క్లోజ్ అయ్యాయి. ప్రధానంగా అమెరికా 3వ త్రైమాసికంలో జీడీపీ వృద్ధిని నమోదు చేయటం కొంత మార్కెట్లకు సపోర్ట్ చేసింది. అయితే అక్కడి టెక్ కంపెనీల పనితీరు ఆశించిన తీరులో లేకపోవటం భారీ నష్టాలకు దారి తీసింది.

మార్కెట్ క్లోజింగ్..
శుక్రవారం మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ సూచీ 203 పాయింట్ల లాభంతో ఉంది. మరో కీలక సూచీ నిఫ్టీ 50 పాయింట్ల లాభపడింది. అయితే బ్యాంక్ నిఫ్టీ సూచీ మాత్రం 308 పాయింట్ల నష్టంలో క్లోజ్ కాగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ 169 పాయింట్లు కోల్పోయింది. రిజర్వు బ్యాంక్ వచ్చే నెల 3న అత్యవసరంగా సమావేశం కావాలని నిర్ణయించుకోవటంతో బ్యాంకింగ్ రంగంలోని షేర్ల ఇన్వెస్టర్లు ఆందోళనకు గురికావటం ఇందుకు కారణంగా నిలిచింది. మళ్లీ భారీగా వడ్డీ రేట్లు పెరుగుతాయని వారు భావిస్తున్నారు.

టాప్ గెయినర్స్..
మార్కెట్లు ముగిసే సమయంలో మారుతీ, రిలయన్స్, అపోలో హాస్పిటల్స్, ఎన్టీపీసీ, హీరో మోటొకార్ప్, పవర్ గ్రిడ్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఓఎన్జీసీ, బజాజ్ ఆటో, కోల్ ఇండియా, బజాజ్ ఫిన్ సర్వ్, కోటక్ బ్యాంక్, టైటాన్, ఐషర్ మోటార్స్ తో పాటు మరిన్ని కంపెనీల షేర్లు లాభాల్లో టాప్ గెయినర్స్ గా నిలిచాయి.

టాప్ లూజర్స్..
ఎన్ఎస్ఈ సూచీలోని టెక్ మహీంద్రా, టాటా స్టీల్, సన్ ఫార్మా, గ్రాసిమ్, దివీస్ ల్యాబ్, హిందాల్కొ, ఐసీఐసీఐ బ్యాంక్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్, టాటా కన్జూమర్, డాక్టర్ రెడ్డీస్, సిప్లా, ఇన్ఫోసిస్, అదానీ పోర్ట్స్ తో పాటు మరిన్ని కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్స్ గా నిలిచాయి.


Click it and Unblock the Notifications