Stock Market: ఉదయం లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు చివరికి మాత్రం స్వల్ప నష్టాలతో ప్రయాణాన్ని ముగించాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి వచ్చిన సంకేతాలకు అనుగుణంగా మార్కెట్ల ర్యాలీకి బ్రేక్ పడింది. దీంతో మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. అయితే ఇన్వెస్టర్ల సంపద మాత్రం మార్కెట్లలో పెరిగింది.
మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 35 పాయింట్లు నష్టపోగా, మరో కీలక సూచీ నిఫ్టీ 18 పాయింట్ల మేర నష్టపోయింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 144 పాయింట్లు లాభాలతో ముగిసింది. చివరగా నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 96 పాయింట్లు లాభపడింది.

మార్కెట్లు ముగిసే సమయంలో ఎన్ఎస్ఈ సూచీలోని అదానీ ఎంటర్ ప్రైజెస్, ఏషియన్ పెయింట్స్, హిందుస్థాన్ యూనీలివర్, అదానీ పోర్ట్స్, ఎన్టీపీసీ, ఇండస్ ఇండ్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్స్, మారుతీ, సన్ ఫార్మా, హెచ్డీఎఫ్సీ లైఫ్, యూపీఎల్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, బ్రిటానియా, టైటాన్, బజాజ్ ఫైనాన్స్, టాటా మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్, పవర్ గ్రిడ్ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో సూచీలోని డాక్టర్ రెడ్డీస్, ఎల్ టి, హిందాల్కొ, దివీస్ ల్యాబ్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఐటీసీ, భారతీ ఎయిర్ టెల్, ఎస్బీఐ లైఫ్, రిలయన్స్, టాటా స్టీల్, టాటా కన్జూమర్, ఇన్ఫోసిస్, ఐషర్ మోటార్స్, బజాజ్ ఆటో, అపోలో హాస్పిటల్స్, టీసీఎస్, సిప్లా, టెక్ మహీంద్రా, హీరో మోటార్స్, బీపీసీఎల్ కంపెనీల షేర్లు మాత్రం టాప్ లూజర్లుగా నిలిచాయి.


Click it and Unblock the Notifications