Closing Bell: ఉదయం భారీ నష్టాల్లోకి జారుగుకున్న దేశీయ స్టాక్ మార్కెట్లు తర్వాత కొద్ది సేపటికి తిరిగి పుంజుకున్నాయి. వాస్తవానికి హెచ్డీఎఫ్సీ బలమైన క్యూ1 ఫలితాలతో పెరుగుదల మార్కెట్ల నష్టాలను తుడిచేసింది. ఎకనామిక్ సర్వే సైతం నేడు రావటం మార్కెట్లపై కొంత ప్రభావాన్ని చూపింది.
మార్కెట్ల ముగింపు సమయానికి బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 103 పాయింట్లు నష్టపోగా, మరో కీలక సూచీ నిఫ్టీ 22 పాయింట్లు కోల్పోయింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 15 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 716 పాయింట్ల లాభంతో నేడు ప్రయాణాన్ని ముగించాయి. నేడు ఇంట్రాడేలో బడ్జెట్ ప్రకటనకు ఒక్క రోజు ముందర గ్రామీణ ప్రాంతాలపై బడ్జెట్ దృష్టి ఉంటుందనే ఆశావాదంలో ఫెర్టిలైజర్ స్టాక్ ఏకంగా 13 శాతం పెరిగాయి. అలాగే క్యూ1 ఫలితాల్లో మార్కెట్ల అంచనాలను అందుకోలేకపోయిన టెక్ దిగ్గజం విప్రో స్టాక్ ఇంట్రాడేలో 8 శాతం నష్టాన్ని చూసింది. ప్రధానంగా నేడు మార్కెట్లు యూనియన్ బడ్జెట్ ప్రకటనపై భారీగా దృష్టి సారించింది.

ఎన్ఎస్ఈలో గ్రాసిమ్, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఎన్టీపీసీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, పవర్ గ్రిడ్, టాటా స్టీల్, డాక్టర్ రెడ్డీస్, టాటా కన్జూమర్, హిందాల్కొ, బీపీసీఎల్, టాటా మోటార్స్, సన్ ఫార్మా, ఇన్ఫోసిస్, ఎల్ టి, హీరో మోటార్స్, మారుతీ, కోల్ ఇండియా, శ్రీరామ్ ఫైనానన్స్, ఓఎన్జీసీ కంపెనీల షేర్లు లాభాల్లో తమ ప్రయాణాన్ని నేడు ముగించాయి.
ఇదే క్రమంలో విప్రో, రిలయన్స్, కోటక్ బ్యాంక్, ఐటీసీ, ఎస్బీఐ లైఫ్, ఎస్బీఐ, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఎల్ టిఐఎమ్, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, నెస్లే, యాక్సిస్ బ్యాంక్, టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫిన్ సర్వ్, టైటాన్, జేఎస్డబ్ల్యూ స్టీల్, అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పోర్ట్స్ కంపెనీల షేర్లు నష్టాల్లో తమ ప్రయాణాన్ని ముగించాయి.


Click it and Unblock the Notifications