Stock Market: స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. స్టీల్ స్టాక్స్ అప్..
Closing Bell: రోజంతా స్టాక్ మార్కెట్లు నేడు ఒడిదొడుకుల్లో ప్రయాణాన్ని కొనసాగించాయి. ఈ క్రమంలో ఫ్లాట్ ట్రేడింగ్ నమోదు చేశాయి. చివరికి మార్కెట్లు లాభాల్లోనే ట్రేడింగ్ ముగించాయి.
మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 79 పాయింట్లు లాభపడగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 37 పాయింట్ల మేర లాభపడింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 1 పాయింట్ లాభపడగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 133 పాయింట్ల మేర లాభంలో నేడు ట్రేడింగ్ ముగించింది.

ఈరోజు ఇంట్రాడేలో పవర్, రియల్టీ, మెటల్ రంగాలకు చెందిన షేర్లు లాభాల్లో సూచీలను నడిపించాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 0.5 శాతం మేర లాభపడ్డాయి. అయితే మార్కెట్ల ఓలటాలిటీ కొనసాగినప్పటికీ చివరికి బెంచ్ మార్క్ సూచీలు తమ ప్రయాణాన్ని లాభాల్లో ముగించాయి.
ఎన్ఎస్ఈలో జియో ఫైనాన్షియల్, యూపీఎల్, హిందాల్కొ, టాటా స్టీల్, హీరో మోటార్స్, అదానీ పోర్ట్స్, టెక్ మహీంద్రా, బజాజ్ ఆటో, అదానీ ఎంటర్ ప్రైజెస్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎన్టీపీసీ, హెచ్సీఎల్ టెక్నాలజీస్, జేఎస్డబ్ల్యూ స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్స్, పవర్ గ్రిడ్, టైటాన్, టాటా మోటార్స్, ఏషియన్ పెయింట్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, గ్రాసిమ్ కంపెనీల షేర్లు లాభాల్లో ట్రేడింగ్ ముగించి టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో ఎయిర్ టెల్, హిందుస్థాన్ యూనీలివర్, రిలయన్స్, డాక్టర్ రెడ్డీస్, యాక్సిస్ బ్యాంక్, అపోలో హాస్పిటల్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, టాటా కన్జూమర్, ఐసీఐసీఐ బ్యాంక్, సన్ ఫార్మా, ఐటీసీ, టీసీఎస్ కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ ముగించి టాప్ లూజర్లుగా నిలిచాయి.


Click it and Unblock the Notifications