Stock Market: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన అండతో మార్కెట్లు ఉదయం లాభాల్లో ప్రారంభం అయ్యాయి. నిన్నటి నష్టాలు పూడ్చుకోవచ్చని భావించిన వారికి అడియాశే మిగిలింది. అనూహ్యంగా మార్కెట్లు మళ్లీ నష్టాల్లోకి జారుకోవటానికి భయాలే కారణమని తెలుస్తోంది.

మార్కెట్ సూచీలు..
ట్రేడింగ్ చివరి గంటల్లో సూచీలు కొంత నష్టాల నుంచి తేరుకున్నాయి. అయితే దలాల్ స్ట్రీట్ నేడు కూడా బేర్స్ చేతుల్లోనే కొనసాగింది. మార్కెట్ క్లోజింగ్ సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 304 పాయింట్లను కోల్పోయింది. ఇదే క్రమంలో మరో కీలక సూచీ నిఫ్టీ 50 పాయింట్లను కోల్పోగా.. బ్యాంక్ నిఫ్టీ 350 పాయింట్ల నష్టంలో నేటి మార్కెట్ ప్రయాణాన్ని ముగించాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం 158 పాయింట్ల లాభంలో ముగియటం గమనార్హం.

టాప్ గెయినర్స్..
ఎన్ఎస్ఈ సూచీలోని సిప్లా, బజాజ్ ఆటో, ఐటీసీ, హిందుస్థాన్ యూనీలివర్, జేఎస్డబ్ల్యూ స్టీల్, బ్రిటానియా, ఎస్టీపీసీ, హీరో మోటార్స్, బీపీసీఎల్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఐషర్ మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, నెస్లే ఇండియా, సన్ ఫార్మా, ఎస్బీఐ లైఫ్, అదానీ పోర్ట్స్, డాక్టర్ రెడ్డీస్, ఎల్ అండ్ టీ, టాటా స్టీల్ తో పాటు మరిన్ని కంపెనీల షేర్లు మాత్రం మార్కెట్ క్లోజింగ్ సమయానికి లాభాల్లో కొనసాగాయి. దీంతో అవి నేడు టాప్ గెయినర్స్ గా నిలిచాయి.

టాప్ లూజర్స్..
ఎన్ఎస్ఈ సూచీలో బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వ్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, టైటాన్, పవర్ గ్రిడ్, యాక్సిస్ బ్యాంక్, టెక్ మహీంద్రా, విప్రో, ఇండస్ ఇండ్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, భారతీ ఎయిర్ టెల్, టీసీఎస్, అపోలో హాస్పిటల్స్, ఏషియన్ పెయింట్స్, అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీలు నష్టాల్లో ప్రయాణాన్ని ముగించి నేడు టాప్ లూజర్స్ గా నిలిచాయి.
More From GoodReturns

Stock market Holidays: ఏప్రిల్లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications