Market Closing Bell: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస నష్టాలను కొనసాగిస్తున్నాయి. ఉదయం నష్టాలతో ప్రారంభం కాగా అదే ధోరణిని సాయంత్రం వరకు కొనసాగించాయి. మార్కెట్లలో పెరుగుతున్న భయాలతో పాటు కొనసాగుతున్న బేర్ మార్కెట్లు ఇన్వెస్టర్లను ఆచితూచి ముందుకు సాగేలా చేస్తున్నాయి.
మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 536 పాయింట్ల నష్టపోగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 149 పాయింట్ల మేర నష్టాన్ని చవిచూసింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 57 పాయింట్ల నష్టంతో నేటి ప్రయాణాన్ని ముగించాయి. అయితే ఈ క్రమంలో నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం లాభాలతో 140 పాయింట్లు పెరిగి తన ప్రయాణాన్ని ముగించింది. తొలిసారిగా బజాజ్ ఆటో కంపెనీ షేర్ ధర రూ.7000 మార్కును దాటింది. ప్రధానంగా ఐటీ కంపెనీల షేర్లు నష్టపోవటంతో మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. నిరాశాజనకమైన క్యూ3 ఫలితాల అంచనా ఐటీ స్టాక్స్ పతనానికి కారణంగా ఉందని నిపుణులు వెల్లడించారు.

ఎన్ఎస్ఈలో బజాజ్ ఆటో, అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పోర్ట్స్, సిప్లా, ఐటీసీ, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎయిర్ టెల్, బీపీసీఎల్, ఎస్బీఐ, అపోలో హాస్పిటల్స్, ఓఎన్జీసీ, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎన్టీపీసీ, సన్ ఫార్మా, కోటక్ బ్యాంక్, ఎల్ టి, మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా నేడు ప్రయాణాన్ని ముగించాయి.
ఇదే క్రమంలో హిందాల్కొ, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఎల్ టిఐఎమ్, టెక్ మహీంద్రా, విప్రో, ఇన్ఫోసిస్, టీసీఎస్, హీరో మోటార్స్, నెస్లే, హెచ్సీఎల్ టెక్నాలజీస్, కోల్ ఇండియా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, మారుతీ, యూపీఎల్, గ్రాసిమ్, హెచ్డీఎఫ్సీ లైఫ్, రిలయన్స్, ఎస్బీఐ లైఫ్, అల్ట్రాటెక్ సిమెంట్స్ కంపెనీల షేర్లు నష్టాలతో తమ ప్రయాణాన్ని ముగించాయి.


Click it and Unblock the Notifications