Stock Market: లాభాల్లో ముగిసిన మార్కెట్లు.. ఐటీ, అదానీ స్టాక్స్ ర్యాలీతో దూకుడు..
Closing Bell: ఉదయం ఫ్లాట్ ట్రేడింగ్ కొనసాగించిన మార్కెట్లు ఆ తర్వాత పుంజుకున్నాయి. ప్రధానంగా ఐటీ షేర్లలో ర్యాలీ పాటు సుప్రీం కోర్టులో అదానీ గ్రూప్ కేసు దర్యాప్తులో వెలువడ్డ తీర్పు మార్కెట్లకు పుష్ ఇచ్చింది. ఈ క్రమంలో అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు భారీగానే లాభపడ్డాయి.
మార్కెట్లు ముగిసే సమయంలో దేశీయ బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 302 పాయింట్ల లాభంలో, మరో కీలక సూచీ నిఫ్టీ 77 పాయింట్ల మేర లాభంలో ప్రయాణం ముగించింది. ఇక నిఫ్టీ బ్యాంక్ సూచీ 229 పాయింట్ల లాభంలో క్లోజ్ కాగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం 40 పాయింట్ల స్వల్ప నష్టంతో ట్రేడింగ్ ముగించింది.

ఇదే సమయంలో ఎన్ఎస్ఈలో అదానీ పోర్ట్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్, టాటా మోటార్స్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్, యాక్సిస్ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్స్, గ్రాసిమ్, విప్రో, ఐసీఐసీఐ బ్యాంక్, టీసీఎస్, కోటక్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, మారుతీ, ఎయిర్ టెల్, హిందుస్థాన్ యూనీలివర్, రిలయన్స్, హిందాల్కొ కంపెనీల షేర్లు లాభాలతో ప్రయాణం ముగించి టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే సమయంలో దివీస్ ల్యాబ్, బ్రిటానియా, ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, హెచ్సీఎల్ లైఫ్, హీరో మోటార్స్, యూపీఎల్, ఏషియన్ పెయింట్స్, పవర్ గ్రిడ్, డాక్టర్ రెడ్డీస్, టైటాన్, బజాజ్ ఆటో, టాటా స్టీల్, ఐషర్ మోటార్స్, టాటా కన్జూమర్, సన్ ఫార్మా, నెస్లే, హెచ్డీఎఫ్సీ, బజాజ్ ఫైనాన్స్, అపోలో హాస్పిటల్స్ కంపెనీల షేర్లు నష్టాల్లో ప్రయాణం ముగించి టాప్ లూజర్లుగా నిలిచాయి.


Click it and Unblock the Notifications