Market Closing: ఉదయం తీవ్ర ఒడిదొడుకుల్లో ప్రారంభమైన మార్కెట్లు చాలా సేపు స్తబ్ధుగా తమ ప్రయాణాన్ని ప్రారంభించాయి. అయితే సమయం గడిచేకొద్ది మార్కెట్లు మంచి లాభాలను ఆర్జించాయి.
మార్కెట్లు క్లోజింగ్ సమయానికి బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 235 పాయింట్ల లాభంలో ఉండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 99 పాయింట్ల లాభంలో క్లోజ్ అయ్యింది. ఈ క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 216 పాయింట్ల లాభంలో ప్రయాణాన్ని ముగించింది. చివరగా నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ సైతం 203 పాయింట్ల లాభంలో ముగిసింది.

మార్కెట్లు ముగిసే సమయానికి దివీస్ ల్యాబ్, బజాజ్ ఆటో, అదానీ ఎంటర్ ప్రైజెస్, ఐషర్ మోటార్స్, డాక్టర్ రెడ్డీస్, కోల్ ఇండియా, ఇన్ఫోసిస్, ఎస్బీఐ లైఫ్, టాటా మోటార్స్, సిప్లా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, అపోలో హాస్పిటల్స్, ఏషియన్ పెయింట్స్, టెక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, టీసీఎస్, సన్ ఫార్మా, హెచ్డీఎఫ్సీ లైఫ్, హెచ్సీఎల్ టెక్ కంపెనీల షేర్లు లాభాల్లో టాప్ గెయినర్స్ గా నిలిచారు.
ఇదే క్రమంలో పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ, నెస్లే, అల్ట్రాటెక్ సిమెంట్స్, హిందుస్థాన్ యూనిలివర్, ఓఎన్జీసీ, ఎస్బీఐ, యూపీఎల్, ఎల్ టి, ఐటీసీ, బీపీసీఎల్, భారతీ ఎయిర్ టెల్, మారుతీ, యాక్సిస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, హిందాల్కొ షేర్లు నష్టాల్లో కొనసాగుతూ టాప్ లూజర్స్ గా నిలిచాయి.


Click it and Unblock the Notifications