Stock Market Closing Bell: వరుసగా దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుల్ జోరును కొనసాగిస్తున్నాయి. అమెరికా మార్కెట్లలో లాభాల సందడి మన మార్కెట్లకు అండగా నిలుస్తోంది. నిన్న ప్రారంభంలో అమ్మకాల ఒత్తిడి కనిపించనప్పటికీ.. మార్కెట్లు మళ్లీ గాడిన పడ్డాయి. దీనికి బ్రిటన్ కొత్త ప్రధాని పన్నుల విధానంపై స్పష్టత ఇవ్వటం కూడా బాగా కలిసొచ్చింది.

మార్కెట్ల ముగింపు ఇలా..
ఈ ఉదయం 300 పాయింట్లకు పైగా లాభంలో ప్రారంభమైన సెన్సెక్స్ సూచీ మార్కెట్లు ముగిసే సమయానికి 555 పాయింట్ల లాభంతో ముగిసింది. ఇదే సమయంలో నిఫ్టీ సూచీ 178 పాయింట్లు లాభపడింది. బ్యాంక్ నిఫ్టీ సూచీ 386 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ 356 పాయింట్ల లాభంతో ముగిశాయి. ప్రధానంగా మార్కెట్లు ముగిసే సమయానికి అన్ని రంగాల సూచీలు గ్రీనిష్ గా ఉన్నాయి. ఎఫ్ఎమ్సీజీ, ఆటో, క్యాపిటల్ గూడ్స్, పీఎస్ యూ బ్యాంక్స్, రియల్టీ రంగాలు అత్యధికంగా లాభపడ్డాయి.

టాప్ గెయినర్స్..
ఎస్బీఐ, అదానీ పోర్ట్స్, ఐషర్ మోటార్స్, ఐటీసీ, ఎస్బీఐ లైఫ్, నెస్లే ఇండియా, అదానీ ఎంటర్ ప్రైజెస్, భారతీ ఎయిర్ టెల్, ఇండస్ ఇండ్ బ్యాంక్, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, అపోలో హాస్పిటల్స్, ఎల్ అండ్ టీ, రిలయన్స్, సిప్లా, కోల్ ఇండియా, హిందాల్కో తో పాటు అనేక షేర్లు మార్కెట్ ముగిసే సమయానికి టాప్ గెయినర్స్ గా ఉన్నాయి.

టాప్ లూజర్స్..
మార్కెట్లు ముగిసే సమయానికి ఎన్ఎస్ఈలో ఎన్టీపీసీ, హెచ్డీఎఫ్సీ, సన్ ఫార్మా, బ్రిటానియా, టెక్ మహీంద్రా, హెచ్డీఎఫ్టీ బ్యాంక్, గ్రాసిమ్, బీపీసీఎల్, బజాజ్ ఆటో, కోటక్ మహీంద్రా బ్యాంక్, దివీల్ ల్యాబ్ షేర్లు మాత్రం టాప్ లూజర్స్ గా నష్టాల్లో నిలిచాయి.
More From GoodReturns

Stock market: స్టాక్ మార్కెట్ ఊపు! ఒక్కరోజే 2000 పాయింట్లు జంప్..ఈ 5 కారణాలే కీలకం!

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

స్టాక్ మార్కెట్లో అల్లకల్లోలం.. రూ. 1.2 లక్షల కోట్లను వెనక్కి తీసుకున్న విదేశీ ఇన్వెస్టర్లు..కారణం ఏంటంటే..

Stock market Holidays: ఏప్రిల్లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications