Markets Closing: వారాంతలో లాభాలతో ముగిసిన మార్కెట్లు.. మెరిసిన మూడు రంగాలు..
Closing Bell: ఉదయం మంచి లాభాల్లో మెుదలైన దేశీయ స్టాక్ మార్కెట్లు చివరికి పాజిటివ్ నోట్‌లో ముగిశాయి. ఈ క్రమంలో ఐటీ, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాల షేర్లలో అమ్మకాలు నమోదయ్యాయి.
మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 119 పాయింట్ల లాభపడగా.. మరో కీలక సూచీ నిప్టీ 46 పాయింట్ల మేర ఎగబాకింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 148 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ 154 పాయింట్లు లాభపడ్డాయి. మెుత్తానికి ఒడిదొడుకులు ఉన్నప్పటికీ మార్కెట్లు వారాన్ని లాభాల్లో ముగించాయి. ఈ క్రమంలో ఆటో, రియల్టీ, మెటల్ రంగాల షేర్లు భారీగా లాభపడ్డాయి.

ఎన్ఎస్ఈలో హిందాల్కొ, హీరో మోటార్స్, అపోలో హాస్పిటల్స్, టాటా స్టీల్, మారుతీ, మహీంద్రా అండ్ మహీంద్రా, జేఎస్డబ్ల్యూ స్టీల్, డాక్టర్ రెడ్డీస్, సన్ ఫార్మా, ఎల్ టి, భారతీ ఎయిర్ టెల్, టైటాన్, యూపీఎల్, పవర్ గ్రిడ్, బజాజ్ ఆటో, నెస్లే, ఓఎన్జీసీ, ఎస్బీఐ, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు లాభాల్లో ప్రయాణాన్ని ముగించి టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే సమయంలో అదానీ ఎంటర్ ప్రైజెస్, బీపీసీఎల్, హెచ్డీఎఫ్సీ లైఫ్, టీసీఎస్, విప్రో, హెచ్సీఎల్ టెక్, ఎస్బీఐ లైఫ్, రిలయన్స్, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ, ఐషర్ మోటార్స్, ఎన్టీపీసీ, టెక్ మహీంద్రా, దివీస్ ల్యాబ్స్, టాటా మోటార్స్, అల్ట్రాటెక్ సిమెంట్స్ కంపెనీల షేర్లు నష్టాల్లో ముగిసి టాప్ లూజర్లుగా నిలిచాయి.


Click it and Unblock the Notifications