Stock Market: చంద్రయాన్ సక్సెస్ మూడ్‌లో మార్కెట్లు.. లాభాల్లో ముగిసిన సూచీలు..
Stock Market: ఉదయం ఊగిసలాడుతూ మెుదలైన మార్కెట్లు తర్వాత పుంజుకుని లాభాల్లో ట్రేడింగ్ కొనసాగాయి. మెుత్తం దేశం చంద్రయాన్ సక్సెస్ కోసం వేచి ఉండగా.. అందులో భాగస్వాములైన కంపెనీల షేర్లు లాభాల్లో ట్రేడింగ్ కొనసాగించాయి.
మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 213 పాయింట్లు లాభపడగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 43 పాయింట్లు గెయిన్ అయింది. ఇదే సమయంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 483 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 150 పాయింట్ల లాభంలో ట్రేడింగ్ ముగించింది. ఈ క్రమంలో L&T, BHEL, HUL, కెల్ట్రాన్ ఎలక్ట్రానిక్ పవర్, గోద్రెజ్ & బోయ్స్, వాల్‌చంద్ ఇండస్ట్రీస్ కంపెనీల షేర్లు లాభాల్లో ముగిశాయి.

ఎన్ఎస్ఈలో హిందాల్కొ, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, దివీస్ ల్యాబ్స్, ఎల్ టి, ఎస్బీఐ, టాటా స్టీల్, మారుతీ, సిప్లా, నెస్లే, కోటక్ బ్యాంక్, ఎస్బీఐ లైఫ్, బజాజ్ ఆటో, బజాజ్ ఫైనాన్స్, పవర్ గ్రిడ్, ఎల్ టిఐఎమ్, డాక్టర్ రెడ్డీస్, అపోలో హాస్పిటల్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యూపీఎల్ కంపెనీల షేర్లు లాభాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తూ టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో అదానీ ఎంటర్ ప్రైజెస్, జియో ఫైనాన్సియల్స్, అదానీ పోర్ట్స్, సన్ ఫార్మా, టెక్ మహీంద్రా, ఎయిర్ టెల్, టాటా మోటార్స్, ఐటీసీ, ఓఎన్జీసీ, బీపీసీఎల్, గ్రాసిమ్, టాటా కన్జూమర్, అల్ట్రాటెక్ సిమెంట్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, విప్రో, ఏషియన్ పెయింట్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, హీరో మోటార్స్, టైటాన్, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ ముగించి టాప్ లూజర్లుగా నిలిచాయి.


Click it and Unblock the Notifications