Market Closing: ఉదయం ఐటీ రంగం అనిశ్చితుల మధ్య మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ట్రేడయ్యాయి. దీంతో ఏప్రిల్ చివరి ట్రేడింగ్ రోజులు దేశీయ మార్కెట్లు మంచి లాభాలతో ముగించాయి.
మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 463 పాయింట్ల లాభంతో నెల చివరి రోజు ట్రేడింగ్ ముగించింది. ఇదే సమయంలో నిఫ్టీ సూచీ 150 పాయింట్లు, నిఫ్టీ బ్యాంక్ సూచీ 233 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 390 పాయింట్ల లాభంలో తమ ట్రేడింగ్ ముగించాయి. ప్రధానంగా అన్ని రంగాలు లాభాల్లో ముగియగా.. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 1 శాతం మేర లాభపడ్డాయి.

గ్లోబల్ సంకేతాలు సానుకూలంగా ఉన్నప్పటికీ, మార్కెట్ ప్రారంభంలో అస్థిరత వల్ల నష్టాల్లోకి జారుకున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా అమెరికా నుంచి వచ్చిన మిశ్రమ స్థూల ఆర్థిక గణాంకాలతో పాటు ఫైనాన్షియల్ స్టాక్స్‌లో నష్టాల వల్ల భారత స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం ప్రారంభ ట్రేడింగ్‌లో లాభాలను కోల్పోయాయి. అయితే ఆ తర్వాత దేశీయ మార్కెట్లు బలమైన రికవరీని నమోదు చేశాయి.
NSE సూచీలో అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పోర్ట్స్, నెస్లే, విప్రో, బ్రిటానియా, ఐటీసీ, ఎల్ టి, హెచ్డీఎఫ్సీ లైఫ్, అపోలో హాస్పిటల్స్, హీరో మోటార్స్, ఎస్బీఐ, టెక్ మహీంద్రా, రిలయన్స్, యూపీఎల్, ఎయిర్ టెల్, కోటక్ బ్యాంక్, హిందాల్కొ, ఐషర్ మోటార్స్, టాటా కన్జూమర్, బజాజ్ ఫైనాన్స్ కంపెనీల షేర్లు లాభాలతో తమ ప్రయాణాన్ని ముగించి టాప్ గెయినర్స్‌గా నిలిచాయి.
ఇదే సమయంలో యాక్సిస్ బ్యాంక్, టైటాన్, ఓఎన్జీసీ, జేఎస్డబ్ల్యూ స్టీల్, సిప్లా, హిందుస్థాన్ యూనిలివర్, బాలాజీ ఫిన్ సర్వ్, ఏషియన్ పెయింట్స్, డాక్టర్ రెడ్డీస్, హెచ్డీఎఫ్సీ షేర్లు మాత్రం నష్టాల్లో ముగిసి టాప్ లూజర్స్‌గా నిలిచాయి.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..



Click it and Unblock the Notifications