Stock Market: కొనుగోళ్లతో కళకళలాడిన మార్కెట్.. లాభాల్లో అదానీ స్టాక్స్..
Stock Market: గ్లోబల్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో దేశీయ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎక్కువగా మెుగ్గు చూపారు. దీంతో నేడు స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో కొనసాగాయి. అమెరికా రిటైల్ అమ్మకాల గణాంకాలు మెరుగ్గా ఉండటంతో ప్రపంచ మార్కెట్లకు పెద్ద ఊరట లభించింది. విదేశీ ఇన్వెస్టర్ల సైతం కొనుగోలుదారులుగా నిలిచారు.

మార్కెట్ సూచీలు..
దేశీయ స్టాక్ మార్కెట్లను పరిశీలిస్తే క్లోజింగ్ సమయానికి బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 44 పాయింట్లు, నిఫ్టీ సూచీ 20 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ 215 పాయింట్ల లాభాల్లో ముగిసాయి. అయితే నిఫ్టీ బ్యాంక్ సూచీ మాత్రం స్వల్పంగా 99 పాయింట్ల మేర నష్టాల్లో క్లేజ్ అయ్యింది. మార్కెట్లను గమనిస్తే అన్ని రంగాల్లోనూ ఆల్ రౌండ్ కొనుగోళ్లు కనిపించాయి.

ఐటీ-అదానీ స్టాక్స్..
ఈ రోజు ఐటీ స్టాక్స్ మంచి వృద్దిని నమోదు చేశాయి. ఈ క్రమంలో ఐటీ నిఫ్టీ సూచీ దాదాపు 2 శాతం మేర లాభపడింది. ఎంఫసిస్ 4.33 శాతం, టెక్ మహీంద్రా 3.73 శాతం, ఎల్ అండ్ టెక్నాలజీ 3.55 శాతం, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ 1.17 శాతం మేర లాభపడ్డాయి. అలాగే టెక్ మహీంద్రా స్టాక్ రెండు రోజుల్లో దాదాపు 15 శాతం లాభపడింది. ఇదే సమయంలో మెుత్తం 10 అదానీ కంపెనీల్లో 8 లాభాల్లో ట్రేడింగ్ ముగించాయి.

టాప్ గెయినర్స్..
NSE సూచీలో ఓఎన్జీసీ, టెక్ మహీంద్రా, అపోలో హాస్పిటల్స్, దివీస్ ల్యాబ్స్, నెస్లే, అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, కోల్ ఇండియా, అదానీ ఎంటర్ ప్రైజెస్, ఎన్టీపీసీ, టీసీఎస్, ఏషియన్ పెయింట్స్, టాటా కన్జూమర్, విప్రో, కోటక్ బ్యాంక్, ఇన్పోసిస్, సిప్లా, హిందాల్కొ, పవర్ గ్రిడ్ స్టాక్స్ లాభాల్లో ముగిసి టాప్ గెయినర్స్ గా కొనసాగుతున్నాయి.

టాప్ లూజర్స్..
బీపీసీఎల్, బజాజ్ ఫైనాన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఐషర్ మోటార్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, హిందుస్థాన్ యూనీలివర్, టాటా మోటార్స్, యాక్సిస్ బ్యాంక్, మారుతీ, ఎస్బీఐ, ఎస్బీఐ లైఫ్, హీరో మోటొకార్ప్, హెచ్సీఎల్ టెక్, ఐసీఐసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్ టెల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బ్రిటానియా, ఇండస్ ఇండ్ బ్యాంక్, సన్ ఫార్మా, హెచ్డీఎఫ్సీ స్టాక్స్ నష్టాల్లో ముగిసి టాప్ లూజర్స్ గా నమోదయ్యాయి.


Click it and Unblock the Notifications