Market Closing: ఉదయం ఫ్లాట్ ఆరంభంలో ఊగిసలాడిన దేశీయ స్టాక్ మార్కెట్లు మెుత్తానికి నెల చివరి రోజును మంచి లాభాల్లో ముగించింది. ఎఫ్ఎమ్సీజీ తప్ప మిగిలిన రంగాలన్నీ లాభాల్లో ట్రేడయ్యాయి.
మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 368 పాయింట్ల మేర లాభంలో ట్రేడింగ్ ముగించింది. ఇదే క్రమంలో మరో కీలక సూచీ నిఫ్టీ 108 పాయింట్ల మేర లాభపడింది. అలాగే నిఫ్టీ బ్యాంక్ సూచీ 183 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ 364 పాయింట్ల మేర లాభాల్లో నెల చివరి ట్రేడింగ్ సెషన్ క్లోజ్ చేశాయి.

గత వారం చివరి వ్యాపార రోజు శుక్రవారం మార్కెట్ క్షీణతతో ముగిసింది. నేటి పెరుగుదల తర్వాత పెట్టుబడిదారుల సంపద గత వారం రూ.304.10 లక్షల కోట్ల నుంచి రూ.306.62 లక్షల కోట్లకు పెరిగింది. ఉదయం ప్రాఫిట్ బుకింగ్ కారణంగా స్టాక్ మార్కెట్ పతనంతో ప్రారంభమైనప్పటికీ.. చివరికి మార్కెట్లు మంచి లాభాలను నమోదు చేశాయి.

ఎన్ఎస్ఈలో ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్, ఓఎన్జీసీ, అదానీ పోర్ట్స్, టెక్ మహీంద్రా, హిందాల్కొ, టాటా స్టీల్, టీసీఎస్, విప్రో, మారుతీ, టాటా మోటార్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, గ్రాసిమ్, డాక్టర్ రెడ్డీస్, ఎల్ టి, హీరో మోటార్స్, ఎల్ టిఐఎమ్, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, అదానీ ఎంటర్ ప్రైజెస్ కంపెనీల షేర్లు లాభాల్లో ట్రేడింగ్ ముగించి టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో అపోలో హాస్పిటల్స్, బ్రిటానియా, హెచ్డీఎఫ్సీ లైఫ్, బజాజ్ ఫైనాన్స్, కోటక్ బ్యాంక్, దివీస్ ల్యాబ్, హిందుస్థాన్ యూనీలివర్, ఎస్బీఐ లైఫ్, ఐటీసీ, భారతీ ఎయిర్ టెల్, ఏషియన్ పెయింట్స్, యూపీఎల్, నెస్లే, టాటా కన్జూమర్ కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ ముగించి టాప్ లూజర్లుగా నిలిచాయి.
More From GoodReturns

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు.. అలాగే మార్చి 31న కూడా హాలిడే.. కారణం ఏంటంటే..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications