Stock Market: ఐదో రోజూ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు.. రూ.8.5 లక్షల కోట్లు ఢమాల్..
Stock Market: ఇటీవల మార్కెట్లను గమనిస్తే చాలా ఓలటైల్ గా ట్రేడవుతున్నాయి. ఉదయం మార్కెట్ల ఆరంభంలో ఉంటున్న జోష్ ఆ తర్వాత ఆవిరవుతోంది. ఈరోజు సైతం ఉదయం భారీ లాభాల్లో ఉన్న మార్కెట్ సూచీలు చివరికి నష్టాల్లో ముగిశాయి. వరుసగా ఐదో రోజు మార్కెట్లు ఇన్వెస్టర్లను ముంచాయి.

సన్నగిల్లిన సూచీలు..
ఈరోజు మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ సూచీ 344 పాయింట్లు, నిఫ్టీ సూచీ 71 పాయింట్లు, నిఫ్టీ బ్యాంక్ 360 పాయింట్లు నష్టాల్లో ట్రేడింగ్ ముగించాయి. అయితే కేవలం నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం స్వల్పంగా 22 పాయింట్ల లాభంలో ప్రయాణాన్ని ముగించింది. రెండో ట్రేడింగ్ సెషన్లో కొన్ని రంగాల షేర్లలో తీవ్రమైన అమ్మకాల ఒత్తిడి కారణంగా మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి.

ప్రపంచ మార్కెట్ పరిస్థితి..?
బుధవారం ఆసియా మార్కెట్లలో షేర్లు లాభాలను నమోదు చేశాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను స్వల్పంగా పెంచుతుందని ఇన్వెస్టర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇదే క్రమంలో తాజాగా విడుదలైన ద్రవ్యోల్బణం గణాంకాలు ఊరటన కలిగించటం అమెరికా మార్కెట్లను పాజిటివ్ గా డ్రేవ్ చేశాయి. దీంతో S&P 500 ఇండెక్స్, డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్, నాస్ డాక్, నిక్కీ సూచీలు లాభాల్లో ట్రేడింగ్ ముగించాయి. అయితే దేశీయ మార్కెట్లలో అదానీకి చెందిన టోటల్ గ్యాస్, అదానీ ట్రాన్స్‌మిషన్, అదానీ పవర్ స్టాక్స్ వరుసగా రెండో రోండో రోజు కూడా నష్టాల్లో ట్రేడింగ్ ముగించాయి.

టాప్ గెయినర్స్..
అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పోర్ట్స్, ఏషియన్ పెయింట్స్, టాటా స్టీల్, టైటాన్, ఎల్ టి, బీపీసీఎస్, పవర్ గ్రిడ్, జేఎస్డబ్ల్యూ స్టీల్, డాక్టర్ రెడ్డీస్, కోటక్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, సిప్లా, అపోలో హాస్పిటల్స్, యూపీఎల్, దివీస్ ల్యాబ్, హిందాల్కొ, హెచ్సీఎల్ టెక్, బజాజ్ ఫిన్ సర్వ్, ఇన్ఫోసిస్ కంపెనీల షేర్లు మార్కెట్లు ముగిసే సమయానికి ఎన్ఎస్ఈ సూచీలో లాభాల్లో ఉన్నాయి.

టాప్ లూజర్స్..
భారతీ ఎయిర్ టెల్, ఇండస్ ఇండ్ బ్యాంక్, రిలయన్స్, ఎస్బీఐ, హిందుస్థాన్ యూనీలివర్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, నెస్లే, యాక్సిస్ బ్యాంక్, బ్రిటానియా, హెచ్డీఎఫ్సీ లైఫ్, హెచ్డీఎఫ్సీ, విప్రో, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా మోటార్స్, గ్రాసిమ్, మారుతీ, సన్ ఫార్మా, కోల్ ఇండియా, ఓఎన్జీసీ కంపెనీల షేర్లు నష్టాల్లో తమ ప్రయాణాన్ని ముగించాయి.


Click it and Unblock the Notifications