Stock market: భారత స్టాక్ మార్కెట్లలో ఆరు రోజుల వరుస బుల్ జోరుకు బ్రేక్ పడింది. గత వారం స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగియటంతో ఈ వారం అదే బుల్ పరంపర కొనసాగుతుందని అందరూ భావించారు. అయితే అమెరికన్ మార్కెట్లు నష్టాల్లో ముగియటం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల పవనాల మధ్య ఈరోజు ఉదయం మార్కెట్లు నష్టాల్లో ప్రారంభం అయ్యాయి.
ఇంట్రాడే ఆరంభంలోనే 200 పాయింట్ల నెగటివ్ లో ప్రారంభమైన సెన్సెక్స్ చివరికి 306 పాయింట్ల నష్టంతో 55,766 పాయింట్ల వద్ద ముగిసింది. ఇదే సమయంలో మరో కీలక సూచీ నిఫ్టీ 88 పాయింట్లు క్షీణించి 16,631 మార్క్ వద్ద ముగిసింది. ఈ క్రమంలో ఆటో రంగం షేర్లు మార్కెట్లను నష్టాల్లోకి లాగగా.. మెటల్ స్టాక్స్ మాత్రం లాభాలను నమోదు చేశాయి. మార్కెట్లు ముగిసే సమయంలో ఐటీ కంపెనీల షేర్ల కొనుగోలుకు ఇన్వెస్టర్లు మద్దతు చూపడంతో మార్కెట్లు కొంత కోలుకున్నాయి.

ఈ వారం అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్లపై కీలక నిర్ణయం తీసుకోనున్నందున రిటైలర్లు, ట్రేడర్లు ముందస్తుగానే జాగ్రత్త పడుతున్నట్లు నిపుణులు అంటున్నారు. మరో పక్క రిలయన్స్ ఇండస్ట్రీస్ లాభాలు అంచనాలను మిస్ కావటం మాంద్యాన్ని సూచిస్తుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ వారం మెుత్తం మార్కెట్లు ఒడిదొడుకులతో కొనసాగే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది.
రిలయన్స్ ఇండస్ట్రీస్, మహీంద్రా & మహీంద్రా, మారుతీ, ఐషర్ మోటార్స్, ONGC, కోటక్ బ్యాంక్, నెస్లే ఇండియా, టెక్ మహీంద్రా కంపెనీల షేర్లలో ఇన్వెస్టర్లు లాభాలను బుక్ చేసుకోవటం వల్ల నష్టాలను నమోదు చేసి మార్కెట్ల నష్టాలకు కారణమయ్యాయి. మార్కెట్లను కిందకు లాగాయి. ఇదే సమయంలో.. టాటా స్టీల్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, కోల్ ఇండియా, అపోలో హాస్పిటల్స్, హిందాల్కో, NTPC, విప్రో, HCL టెక్, L&T షేర్లు మార్కెట్లకు మద్దతుగా నిలిచాయి.
More From GoodReturns

ఆర్బీఐ కీలక నిర్ణయం: మార్కెట్లలో భారీ కదలికలు ఖాయమా?

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

ఆర్బీఐ నిర్ణయం.. స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు భారీ షాకా?

Stock market: సెన్సెక్స్ పతనం.. కానీ రికవరీ మొదలైందా? నేటి మార్కెట్ టాప్ విన్నర్స్ వీరే!

Reliance Share: రిలయన్స్ షేర్లు ఎందుకు పడిపోతున్నాయి? ఇన్వెస్టర్లు ఇప్పుడేం చేయాలి?

Stock market: యుద్ధ భయాల్లోనూ దూసుకుపోతున్న షేర్లు.. ఇన్వెస్టర్లకు బంపర్ రిటర్న్స్ ఇచ్చిన పెన్నీ స్టాక్స్!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..



Click it and Unblock the Notifications